వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉత్తర భారతదేశంలో భూకంపం: వణికిపోయి పరుగులు తీసిన ప్రజలు

By Pratap
|
Google Oneindia TeluguNews

North India
హైదరాబాద్: ఉత్తర భారతదేశాన్ని సోమవారం సాయంత్రం ఒక మోస్తరు భూకంపం వణికించింది. సోమవారం సాయంత్రం 5.02 గంటలకు ప్రారంభమైన ప్రకంపనలు మూడు నిమిషాల పాటు సాగాయి. దీనివల్ల ఎక్కడా ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లినట్లు వార్తలు వెలువడలేదు. భూకంప తీవ్రత రిక్టర్‌ సూచీపై 5.7గా నమోదైందని భారత వాతావరణ విభాగం అధికారులు పేర్కొన్నారు. అయితే అమెరికా భూగర్భశాఖ మాత్రం 5.4గా లెక్కకట్టింది. భారత్‌-నేపాల్‌ సరిహద్దుల్లో 29.6 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 80.8 డిగ్రీల తూర్పు రేఖాంశంలో ఈ భూకంప కేంద్రం ఉంది. ఇటీవల జపాన్‌లో భూకంపం, సునామీ సృష్టించిన బీభత్సం ఇంకా మదిలోనే మెదులుతున్న నేపథ్యంలో తాజా ప్రకంపనలతో ప్రజలు భీతిల్లారు. ఇళ్ల నుంచి రోడ్లపైకి పరుగులు పెట్టారు.

ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, జమ్మూకాశ్మీర్‌, పంజాబ్‌, హర్యానా, చండీగఢ్‌, హిమాచల్‌ప్రదేశ్‌ల్లో భూకంపం కనిపించింది. ఢిల్లీలోని నోయిడా, గుర్గావ్‌ ప్రాంతాల్లో బలమైన ప్రకంపనలు వచ్చాయని స్థానికులు తెలిపారు. ఇళ్లలోని ఫర్నీచర్‌ కంపించాయని చెప్పారు. భూకంప ప్రభావం యూపీలోని పశ్చిమ, టెర్రాయ్‌ ప్రాంతంలో కనిపించింది. గౌతమబుద్ధ్‌ నగర్‌ (నోయిడా), ఘజియాబాద్‌, రామ్‌పూర్‌, లఖింపూర్‌ ఖేరి, మీరట్‌, మొరాదాబాద్‌ సహా పలు జిల్లాల్లో ప్రకంపనలు వచ్చాయి. ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌, నైనిటాల్‌, రాజస్థాన్‌లోని జైపూర్‌ తదితర ప్రాంతాల్లో భూమి కంపించింది.

ఇండొనేషియాలోనూ సోమవారం తెల్లవారుజామున 3.06గంటలకు ఒక మోస్తరు స్థాయి భూకంపం వచ్చింది. భూకంప తీవ్రతను అమెరికా భూగర్భశాస్త్రవేత్తలు 6.7గా నిర్ధరించగా.. ఇండొనేషియా అధికారులు మాత్రం 7.1గా పేర్కొన్నారు. జావా తీరానికి 277 కిలోమీటర్ల దూరంలో హిందూ మహాసముద్రంలో 24 కిలోమీటర్ల లోతులో ఈ భూకంప కేంద్రం ఉందని అమెరికా భూగర్భ సర్వే సంస్థ పేర్కొంది. దీనివల్ల సునామీ వచ్చే ప్రమాదం ఉందని తొలుత ఇండొనేషియా అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

English summary
An earthquake of moderate intensity hit North India on Monday evening. According to the Indian Meteorological Department the quake was of 5.7 magnitude on the Richter Scale. But there was no immediate report of any loss of life or property
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X