శుక్రుడి నక్షత్ర పరివర్తనం.. ఈ రాశులవారికి లక్ష్మీ కటాక్షం!
జ్యోతిష్య శాస్త్రంలో ఐశ్వర్యం, శృంగారం, లగ్జరీ జీవితానికి కారకుడిగా భావించే శుక్ర గ్రహం యొక్క ప్రతి కదలిక మానవ జీవితంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. గ్రహాల సంచారంతో పాటు అవి ప్రవేశించే నక్షత్రాల మార్పుకు కూడా జ్యోతిష్యంలో ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ క్రమంలోనే జూన్ 2026 లో శుక్ర దేవుడు పునర్వసు నక్షత్రంలో సంచారం ప్రాధాన్యత కలిగి ఉంది.
బృహస్పతి నక్షత్రంలోకి శుక్రుడు
దేవగురువు అయిన బృహస్పతి అధిపతిగా ఉండే పునర్వసు నక్షత్రంలోకి.. దైత్యగురువైన శుక్రుడు ప్రవేశించడం వల్ల విశ్వంలో ఒక ప్రత్యేకమైన శుభ పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. జ్యోతిష్య నిపుణుల లెక్కల ప్రకారం ఈ నక్షత్ర మార్పు మే 31న మొదలైంది జూన్ 11వరకు శుక్రుడు ఈ నక్షత్రంలో ఉండటం కారణంగా కొన్ని రాశుల వారి జాతకాలు పూర్తిగా మారిపోనున్నాయి. ఆ అదృష్ట రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం.

మేష రాశి
పునర్వసు నక్షత్రంలో శుక్రుడి సంచారం మేష రాశి వారికి ఆర్థికంగా అద్భుతమైన బూస్ట్‌ను ఇస్తుంది. వ్యాపారస్తులకు పెండింగ్‌లో ఉన్న ఒప్పందాలు పూర్తవుతాయి. ఉద్యోగస్తులకు కొత్త ఆదాయ మార్గాలు లభిస్తాయి. సమాజంలో మీ గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. కుటుంబంలో చాలా కాలంగా ఉన్న వివాదాలు సామరస్యంగా ముగుస్తాయి.
మిథున రాశి
మిథున రాశి వారికి ఈ నక్షత్ర పరివర్తనం కెరీర్ పరంగా ఎంతో లాభదాయకంగా ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు దక్కుతాయి. మీరు గతంలో పెట్టిన పెట్టుబడుల నుండి ఊహించని లాభాలు వస్తాయి. కళలు, మీడియా రంగంలో ఉన్నవారికి ఈ సమయం సువర్ణావకాశం లాంటిది.
కర్కాటక రాశి
ఇటీవలే మీ రాశిలోకి ఉచ్ఛ గురుడు ప్రవేశించగా, ఇప్పుడు పునర్వసు నక్షత్రంలో శుక్రుడి సంచారం మీకు మరింత అదనపు బలాన్ని ఇస్తుంది. భౌతిక సుఖాలు, విలాస వస్తువుల కొనుగోలుపై ఆసక్తి చూపుతారు. నూతన గృహం లేదా వాహనం కొనుగోలు చేసే సూచనలు బలంగా ఉన్నాయి. వైవాహిక జీవితం ఎంతో మధురంగా సాగుతుంది.
తులా రాశి
శుక్రుడు తులా రాశికి అధిపతి కావడం వల్ల, ఈ నక్షత్ర మార్పు మీకు మానసిక ప్రశాంతతను, శారీరక దృఢత్వాన్ని ఇస్తుంది. వ్యాపారంలో భాగస్వామ్యాలు కలిసి వస్తాయి. విదేశీ ప్రయాణాలకు ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి. సమాజంలో పెద్దల మద్దతుతో కొత్త ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. ఆర్థిక ఇబ్బందుల నుండి పూర్తిగా విముక్తి లభిస్తుంది. శుక్రుడి శుభ ఫలితాలు మరింత పెరగడానికి ఈ కాలంలో శుక్రవారం రోజున లక్ష్మీ దేవిని ఆరాధించడం, తెల్లటి వస్తువులను లేదా స్వీట్లను దానం చేయడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి.













Click it and Unblock the Notifications