ఓట్ల చోరీపై రాష్ట్రపతికి ఫిర్యాదు.. రాహుల్ నెక్స్ట్ స్టెప్ ఏంటి?

భారత ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) జ్ఞానేష్ కుమార్‌ను వెంటనే పదవి నుంచి తొలగించాలని, ఓటర్ల జాబితాలో జరిగిన తీవ్ర అవకతవకలు, ఓట్ల చోరీపై సమగ్ర విచారణ జరిపించేలా జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేస్తూ ఇండియా కూటమికి చెందిన 10 మంది కీలక నేతల ప్రతినిధి బృందం శుక్రవారం రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసింది. ఈ భేటీలో రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, మమతా బెనర్జీ, సుప్రియా సూలే, ఒమర్ అబ్దుల్లా, మనోజ్ ఝా, ఎంఏ బేబీ, డి.రాజా, రాజీవ్ రాయ్, తోల్ తిరుమావళవన్ పాల్గొని రాష్ట్రపతికి ఓ వినతిపత్రాన్ని సమర్పించారు.

ఢిల్లీలో హైఅలర్ట్: ఇంటర్నెట్ బంద్.. 25 వేల మంది పోలీసులతో భద్రత కట్టుదిట్టం?
ఢిల్లీలో హైఅలర్ట్: ఇంటర్నెట్ బంద్.. 25 వేల మంది పోలీసులతో భద్రత కట్టుదిట్టం?

రాష్ట్రపతి ఆరోపణలను ఖండించలేదు.. ఆధారాలు కోరారు: రాహుల్ గాంధీ
రాష్ట్రపతితో భేటీ అనంతరం లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడుతూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. తాము ఓట్ల చోరీ విషయాన్ని రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లినప్పుడు ఆమె ఆ ఆరోపణలను ఖండించలేదని, ఎలాంటి ఎదురు ప్రశ్నలు వేయలేదని వెల్లడించారు. ఈ వ్యవహారానికి సంబంధించిన ఆధారాలు సమర్పించాలని మాత్రమే తమను కోరారని, త్వరలోనే అన్ని ఆధారాలను రాష్ట్రపతి భవన్‌కు సమర్పిస్తామని వెల్లడించారు. ప్రధాని నరేంద్రమోదీ, హోం మంత్రి అమిత్ షా, సీఈసీ జ్ఞానేష్ కుమార్ కలిసి భారత ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా కుట్ర పన్నుతున్నారని, వివిధ రాష్ట్రాల ఎన్నికల్లో ఓట్ల రిగ్గింగ్‌కు సీఈసీ సూత్రధారిగా వ్యవహరిస్తున్నారని రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

Rahul Gandhi Prepares Supreme Court Move After INDIA Alliance Meets President Murmu Over Vote Theft

ఈవీఎంల తొలగింపు డిమాండ్
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ.. దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ఎన్నికలను తిరిగి నిర్వహించాలని, ఈవీఎం వ్యవస్థను రద్దు చేసి పాత పద్ధతిలో బ్యాలెట్ పేపర్లతోనే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ స్పందిస్తూ.. ప్రతిపక్షాల వాదనను రాష్ట్రపతి సానుకూల దృక్పథంలో విన్నారని వెల్లడించారు. దేశ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్య వ్యవస్థలను కాపాడేందుకు రాష్ట్రపతి తక్షణమే ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేసినట్లు ఆమె వివరించారు.

ఢిల్లీకి వెళ్లే అన్ని రైళ్ల రద్దుపై సుప్రీంకోర్టులో పిటీషన్- వాదనలు
ఢిల్లీకి వెళ్లే అన్ని రైళ్ల రద్దుపై సుప్రీంకోర్టులో పిటీషన్- వాదనలు

సుప్రీంకోర్టు తలుపు తట్టనున్న విపక్షాలు
రాష్ట్రపతి భవన్ భేటీకి ముందు ప్రతిపక్ష ఎంపీలు పార్లమెంట్ నుంచి చేపట్టిన పాదయాత్రను, విజయ్ చౌక వద్ద ధర్నాను పోలీసులు అడ్డుకున్నారని రాహుల్ గాంధీ వెల్లడించారు. ఆ తర్వాత ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను కలవడానికి లేదా రాజ్‌ఘాట్ వద్ద నిరసన తెలపడానికి యత్నించగా.. అక్కడ కూడా పోలీసులు ఆంక్షలు విధించారని ఆరోపించారు. వీటన్నింటి నేపథ్యంలో ఎన్నికల కమిషన్ తీరుపై, సీఈసీ జ్ఞానేష్ కుమార్‌పై చట్టపరమైన పోరాటానికి సిద్ధమయ్యామని, సోమవారం భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)ని కలిసి సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+