ఢిల్లీలో హైఅలర్ట్: ఇంటర్నెట్ బంద్.. 25 వేల మంది పోలీసులతో భద్రత కట్టుదిట్టం?

భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామాను డిమాండ్ చేస్తూ అక్టోబర్ 10న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళనలు చేపట్టాలని కాక్రోచ్ జనతా పార్టీ పిలుపునిచ్చింది. ఈ ఆందోళనలకు ఆమ్ ఆద్మీ పార్టీ సహా పలు విపక్ష రాజకీయ పార్టీలు తమ మద్దతును ప్రకటించాయి. ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈ ఆందోళనల్లో తన కుటుంబ సమేతంగా పాల్గొంటానని వెల్లడించారు. ఈ ఆందోళనలకు పిలుపునివ్వడంతో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు.

ఢిల్లీకి వెళ్లే అన్ని రైళ్ల రద్దుపై సుప్రీంకోర్టులో పిటీషన్- వాదనలు
ఢిల్లీకి వెళ్లే అన్ని రైళ్ల రద్దుపై సుప్రీంకోర్టులో పిటీషన్- వాదనలు

కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనలకు ఢిల్లీ పోలీసులు ఎలాంటి అనుమతి ఇవ్వలేదు. ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆమోదంతో ఢిల్లీలోని జంతర్ మంతర్, జనపథ్-కర్తవ్య పథ్ కూడలి పరిసరాల్లోని 4 కిలోమీటర్ల పరిధిలో అక్టోబర్ 9 రాత్రి 10 గంటల నుంచి అక్టోబర్ 10 రాత్రి 10 గంటల వరకు 24 గంటల పాటు మొబైల్ ఇంటర్నెట్ సేవలను పూర్తిగా నిలిపివేశారు. అలాగే ఢిల్లీ పరిధిలో బీఎన్ఎస్ సెక్షన్ 163 విధించినందున.. ప్రజలు ఎలాంటి ఆందోళనల్లో పాల్గొనకూడదని.. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని జాయింట్ సీపీ నూపుర్ ప్రసాద్ హెచ్చరించారు.

Delhi CJP Protest High Alert 24-Hr Internet Shutdown and 25 000 Security Personnel Deployed
CJP Protest: ఢిల్లీలో ఆంక్షలపై సుప్రీం ఫైర్..! భద్రత పేరుతో మూసేస్తారా ?
CJP Protest: ఢిల్లీలో ఆంక్షలపై సుప్రీం ఫైర్..! భద్రత పేరుతో మూసేస్తారా ?

రవాణా ఆంక్షలు, భారీ భద్రత
దేశ రాజధాని వ్యాప్తంగా దాదాపు 25,000 మందికి పైగా పోలీసు, పారామిలటరీ బలగాలను మోహరించారు. ఈ ఆందోళనల కారణంగా భద్రతా దృష్ట్యా 57 మెట్రో స్టేషన్లలో ఎంట్రీ, ఎగ్జిట్ గేట్లను మూసివేసేందుకు డీఎంఆర్సీకి ప్రతిపాదనలు పంపగా.. కొన్ని రైళ్లను రద్దు చేయడం, రీషెడ్యూల్ చేయడం జరిగింది. సాధారణ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా బస్సు టెర్మినళ్లు, రైల్వే స్టేషన్లు, హౌజ్ ఖాస్, కాశ్మీరీ గేట్ వంటి ప్రధాన ప్రాంతాల్లో తనిఖీలను పెంచారు. అదనంగా అక్టోబర్ 9, 10 తేదీల్లో ఢిల్లీ అంతటా మద్యం దుకాణాలను బంద్ చేయాలని ఆదేశించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+