భయం ఉంటే ఏకంగా 'దేశాన్నే బంద్' చేయండి.. కేంద్రంపై సీజేపీ సెటైర్లు!

సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామాను డిమాండ్ చేస్తూ అక్టోబర్ 10న చేపడుతున్న నిరసన ప్రదర్శనకు ముందు ఢిల్లీలో విధించిన తీవ్ర ఆంక్షలపై కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. సీజేపీ నాయకుడు అభిజీత్ దీప్కే తన సహచరులు సౌరభ్ దాస్, అశుతోష్ రాంకాతో కలిసి సోషల్ మీడియాలో ఓ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో వారు మాట్లాడుకూ.. ఆందోళనకారులను అడ్డుకోవడానికి 57 మెట్రో స్టేషన్లను మూసివేయడం, రైళ్లను రద్దు చేయడం, ఇంటర్నెట్ నిలిపివేయడం వంటి చర్యలు కేంద్ర ప్రభుత్వ భయానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు. ఆందోళనకారులకు భయపడి ప్రతిదాన్నీ బంద్ చేసే బదులు కేంద్ర ప్రభుత్వం ఏకంగా దేశాన్నే బంద్ చేయాలని సెటైర్లు వేశారు.

ఢిల్లీలో హైఅలర్ట్: ఇంటర్నెట్ బంద్.. 25 వేల మంది పోలీసులతో భద్రత కట్టుదిట్టం?
ఢిల్లీలో హైఅలర్ట్: ఇంటర్నెట్ బంద్.. 25 వేల మంది పోలీసులతో భద్రత కట్టుదిట్టం?

తగ్గేదేలే.. ఢిల్లీకి తరలివస్తాం..
జంతర్ మంతర్ వద్ద నిరసన తెలిపేందుకు ఢిల్లీ పోలీసులు అనుమతి నిరాకరించినప్పటికీ.. తాము ఖచ్చితంగా అక్టోబర్ 10న ఆందోళన చేపట్టి తీరుతామని అభిజీత్ దీప్కే స్పష్టం చేశారు. జంతర్ మంతర్ అనేది ప్రజలు తమ నిరసనను వ్యక్తం చేయడానికి కేటాయించిన రాజ్యాంగబద్ధమైన ప్రాంతమని.. అక్కడ శాంతియుతంగా ఆందోళన చేసే హక్కు తమకు ఉందన్నారు. ఈ నియంత్రణ చర్యలను అత్యవసర పరిస్థితితో పోల్చిన సీజేపీ నాయకులు.. ప్రజల నిరసన గళాన్ని అణచివేయడానికి ప్రభుత్వం ఎంత ప్రయత్నించినా తాము లొంగబోమని, భయపడేదే లేదని ప్రకటించారు.

Cockroach Janata party Slams Centre Over Delhi Metro and Internet Shutdown Says Shut Whole Country Down
CJP Protest: ఢిల్లీలో ఆంక్షలపై సుప్రీం ఫైర్..! భద్రత పేరుతో మూసేస్తారా ?
CJP Protest: ఢిల్లీలో ఆంక్షలపై సుప్రీం ఫైర్..! భద్రత పేరుతో మూసేస్తారా ?

రవాణా వ్యవస్థ స్తంభనపై తీవ్ర అసహనం
ప్రభుత్వం తీసుకుంటున్న భద్రతా చర్యల వల్ల సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కాక్రోచ్ జనతా పార్టీ విమర్శించింది. ఒకవైపు ఆందోళనల వల్ల ప్రజలకు ఇబ్బందులు కలుగుతాయని చెబుతూనే.. మరోవైపు ప్రభుత్వమే స్వయంగా మెట్రో స్టేషన్లు, రైళ్లు, రోడ్లను మూసివేసి పౌరుల రాకపోకలను స్తంభింపజేస్తోందని ఆరోపించింది. సర్ ప్రక్రియలో జరిగిన అక్రమాలు, ఓటర్ల పేర్ల తొలగింపుపై పారదర్శకత సాధించడమే తమ ప్రధాన డిమాండ్ అని, జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేసేవరకు తమ పోరాటం ఆగదని కాక్రోచ్ జనతా పార్టీ స్పష్టం చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+