సత్య సాయి ట్రస్టు బాబా ఆరోగ్యంపై భక్తులను తప్పు దారి పట్టిస్తోందా?

పుట్టపర్తికి వచ్చే బస్సులను అన్నింటినీ ఆపేశారు. భద్రతా ఏర్పాట్లను పెంచారు. క్విక్ రియాక్షన్ బృందాలను రంగంలోకి దింపారు. హిల్ వ్యూ స్టేడియంలో రెండు లారీల పూలను దింపారు. అక్కడ బారికేడ్లను కూడా నిర్మించారు. దాదాపు 8వేల మంది పోలీసులను పుట్టపర్తిలోకి దించారు. వైద్య బృందం ప్రకటనలో స్పష్టత లేదని అంటున్నారు. బాబా రక్తంపోటు సాధారణ స్థాయిలోనే ఉన్నదని సఫాయా చెప్పారు.
సత్యసాయిబాబాను ఇంకా వెంటలేటర్‌పైనే ఉంచారు. బాబా ఆరోగ్యం మెరుగుపడినట్లు స్పష్టమైన సంకేతాలున్నాయని సఫాయా చెప్పారు. మంగళవారం సాయంత్రం సఫాయా వీడియో బులిటెన్ విడుదల చేసింది. ఈ వీడియో బులిటెన్‌లో కూడా సత్య సాయిబాబా కనిపించలేదు. సత్య సాయిబాబా మార్చి 28వ తేదీన ఆస్పత్రిలో చేరారు.












Click it and Unblock the Notifications