27న తెలంగాణ ఉద్యమ దశాభ్ది బహిరంగ సభ: కెసిఆర్

ఈ నెల 14, 15, 16 తేదీల్లో హైదరాబాదు సమీపంలోని గండిపేటలో చండీ యాగం నిర్వహిస్తామని, తెలంగాణ రాష్ట్ర సిద్ధి కోసం ఈ యాగం నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికకు నిరసనగా ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికలోని 8వ అధ్యాయం పరమ కిరాతకంగా ఉందని ఆయన చెప్పారు. వచ్చే ఉగాది కూడా సమైక్యాంధ్రలోనే నిర్వహించుకుంటామని తెలుగుదేశం పంచాంగ కర్త గార్గేయ చెప్పడాన్ని ఆయన ఎద్దేవా చేశారు. 2009 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధిస్తుందని గార్గేయనే చెప్పారని, ఏమైందో అందరికీ తెలుసునని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications