హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్ వైయస్సార్ కాంగ్రెసుకు కామన్ సింబల్‌పై ఇసిదే నిర్ణయం

By Pratap
|
Google Oneindia TeluguNews

Bhanwar Lal
హైదరాబాద్: వైయస్ జగన్ వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి కామన్ సింబల్ కేటాయించే విషయంపై తుది నిర్ణయం కేంద్ర ఎన్నికల సంఘానిదేనని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్ లాల్ చెప్పారు. కడప లోకసభ, పులివెందుల శానసభ ఉప ఎన్నికలను పకడ్బందీగా నిర్వహిస్తామని ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. భారీగా పోలీసులను మోహరిస్తామని, కేంద్ర బలగాలను కూడా కోరామని ఆయన చెప్పారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలపై రాజకీయ పార్టీలకు సందేహాలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.

ఉప ఎన్నికల విషయంలో వచ్చే ప్రతి ఆరోపణను, ఫిర్యాదును పరిగణనలోకి తీసుకుంటామని, పరిశీలిస్తామని ఆయన చెప్పారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిపై ఎస్ఎంఎస్ ద్వారా ఫిర్యాదు చేసినా స్వీకరిస్తామని ఆయన చెప్పారు. సున్నితమైన పోలింగ్ కేంద్రాల్లో లైవ్ కవరేజీ ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. ఎన్నికల అధికారుల వివరాలతో ఓ బులిటెన్ విడుదల చేస్తామని ఆయన చెప్పారు. ఫిర్యాదుల స్వీకరణకు హైదరాబాదులోని తమ కార్యాలయంలో 1965 నెంబర్‌తో టోల్ ఫ్రీ సదుపాయాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు, ఇది ఈ నెల 12వ తేదీ నుంచి అమలులోకి రానున్నట్లు ఆయన తెలిపారు.

English summary
State chief election officer Bhanwarlal said decision on allocation common symbol to YSR Congress will be taken by EC. He said that arrangements were made for Kadapa bypolls.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X