మద్దెలచెర్వు సూరి హత్యతో నాకు సంబంధం లేదు: పోతుల సురేష్

Pothula Suresh
హైదరాబాద్ : మద్దెలచెర్వు సూరి హత్యతో తనకు సంబంధం లేదని తెలుగుదేశం దివంగత శాసనసభ్యుడు పరిటాల రవి అనుచరుడు పోతుల సురేష్ స్పష్టం చేశారు. ఆయన గురువారం సాయంత్రం హైదరాబాదులోని చర్లపల్లి జైలు నుంచి విడుదలయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. సూరితో గానీ మరెవరితో గానీ తనకు వ్యక్తిగత కక్షలూ కార్పణ్యాలూ లేవని ఆయన అన్నారు. తాను ఫాక్షనిస్టును కానని, సామాజిక కార్యకర్తను మాత్రమేనని ఆయన అన్నారు. తాను రాజకీయాల్లో కొనసాగుతానని ఆయన చెప్పారు. తన భార్య వావిలాల సునీత తెలుగుదేశం పార్టీలో ఉన్నారని, తాను కూడా అదే పార్టీలో కొనసాగుతానని ఆయన అన్నారు.

పోతుల సురేష్‌పై మూడు కేసులున్నాయి. వీటిలో బిఎస్ఎన్ఎల్ టెండర్ల వ్యవహారంలో కిడ్నాప్ కేసును కోర్టు కొట్టేసింది. ఓ హత్య కేసులో ఆయనకు విముక్తి లభించింది. మారణాయుధాలు కలిగి ఉన్నట్లు మోపిన కేసులో బెయిల్ లభించింది. దీంతో ఆయన బెయిల్‌పై జైలు నుంచి విడుదలయ్యారు. పరిటాల రవి హత్య తర్వాత పోతుల సురేష్ 2004లో అజ్ఞాతంలోకి వెళ్లారు. ఆరు నెలల క్రితం పోలీసులకు చిక్కారు. జైలు నుంచి విడుదలైన పోతుల సురేష్‌కు అనుచరులు జైలు వద్ద స్వాగతం చెప్పారు. తాము తెలుగుదేశం పార్టీలో కొనసాగుతామని పోతుల సురేష్ భార్య వావిలాల సునీత చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+