వైయస్ జగన్ పోటీయే కాదు, టిడిపితోనే మాకు పోటీ: డిఎల్ రవీంద్రా రెడ్డి

DL Ravindra Reddy
కడప: కడప లోకసభ స్థానంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు వైయస్ జగన్‌ తనతో పోటీకే దీటు కారని, తనకూ తెలుగుదేశం పార్టీ అభ్యర్థికీ మధ్యనే పోటీ ఉంటుందని కడప లోకసభ అభ్యర్థి, రాష్ట్ర ఆరోగ్య మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. ఈ ఎన్నికలు ధర్మానికి, అధర్మానికి జరుగుతున్నవిగా ఆయన అభిప్రాయపడ్డారు. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రజల సొమ్మును అక్రమంగా దోచుకున్న వైఎస్.జగన్మోహన్ రెడ్డికి తగిన గుణపాఠం చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. ఆయన కందుల శివానంద రెడ్డితో సమావేశమయ్యారు.

అవినీతిపై సమరభేరీ మోగించిన సామాజిక కార్యకర్త అన్నా హజారేకు అవినీతి రారాజులు గాలి జనార్ధన్ రెడ్డి, వైఎస్.జగన్మోహన్ రెడ్డిలు మద్దతు తెలుపడం విడ్డూరంగా ఉందని రాష్ట్ర మంత్రి డీఎల్.రవీంద్రా రెడ్డి వ్యాఖ్యానించారు. ఈనెల 16 లేదా 18వ తేదీల్లో కడప లోక్‌సభ ఉప ఎన్నికల కోసం నామినేషన్ దాఖలు చేయనున్నట్టు ఆయన తెలిపారు. ఈ ఎన్నికల్లో తమ పార్టీ తప్పకుండా విజయం సాధిస్తుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+