నేను ఎప్పటికీ రాజకీయాల్లోకి రాను, బిల్లు ముఖ్యం: అన్నాహజారే

అవినీతి అధికారులను ఉరితీయాలని హెచ్చరించారు. అవినీతిని రూపుమాపేందుకు గట్టి చట్టం ఉండాలన్నారు. అవినీతిని కూకటి వేళ్లతో నిర్మూలించేందుకు చట్టం తేవాలన్నారు. కొన్ని స్వార్థ శక్తులే ప్యానల్ అంశాన్ని లేవనెత్తుతున్నాయని అన్నారు. పార్లమెంటుపై తనకు నమ్మకం ఉందన్నారు. లోక్‌పాల్ బిల్లుపై వచ్చేవారం భేటీ ఉంటుందన్నారు. ప్రజలు తన ఆందోళనకు ఇంతగా మద్దతు ఇస్తారని అనుకోలేదన్నారు. బిల్లు ఆమోదం పొందే వరకు ఆందోళన కొనసాగిస్తామని చెప్పారు. కిరణ్ బేడీ ప్యానెల్‌లో ఉండేందుకు ఇష్టపడలేదన్నారు. ప్యానెల్ సమావేశాలు పారదర్శకంగా సాగుతాయన్నారు. సమావేశాలు ప్రత్యక్ష ప్రసారం చేయాలని కోరారు.












Click it and Unblock the Notifications