రాజీనామా యోచనలో కొడాలి నాని, ముదురుతున్న వివాదం

కాగా, వంశీ రాజీనామాను అడ్డుకోవడానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అడ్డుకోవడానికి ప్రయత్నించారు. అయితే, వంశీ వారి మాటలు వినలేదు. తమ పార్టీలో సంక్షోభాలు మామూలేనని, చంద్రబాబు సమస్యను పరిష్కరిస్తారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు గద్దె రామ్మోహన్ అన్నారు. చంద్రబాబు రాయబారిగా వచ్చిన బుచ్చయ్య చౌదరి తనతో మాట్లాడారని, కానీ ఉమా మహేశ్వర రావుతో హరికృష్ణకు క్షమాపణలు చెప్పించలేకపోయారని ఆయన అన్నారు. తాను తన రాజీనామా విషయంపై హరికృష్ణతో కూడా మాట్లాడినట్లు ఆయన తెలిపారు. తెలుగుదేశం డ్రామాలో తాము పాత్రధారులం కాదని, తాను కొడాలి నాని కలిసే నడుస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications