జగన్ వెళ్లేది పార్లమెంటుకు కాదు, తీహార్ జైలుకు: గోరంట్ల బుచ్చయ్య చౌదరి

కడప పార్లమెంట్‌కు పోటీ చేస్తూ ముఖ్యమంత్రి ఎలా అవుతావని ఆయన ప్రశ్నించారు. ఆ ఉద్దేశముంటే తన వెంట ఉన్న ఎమ్మెల్యేలందరితోనూ రాజీనామాలు చేయించి ఎన్నికలకు సిద్ధం కావాల్సిందని అన్నారు. టెలికమ్ మాజీ మంత్రి ఎ రాజా జైల్లో జగన్ కోసమే ఎదురుచూస్తున్నారని ఆయన అన్నారు. అతిత్వరలోనే జగన్‌కు జైలుకెళ్లే పరిస్థితులు వస్తాయన్నారు. వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయితే ఎన్ని ఫైళ్ల మీద తొలి సంతకం చేస్తారని తెలుగుదేశం నేత పుష్పలీల అడిగారు.












Click it and Unblock the Notifications