అమూల్‌కు రాహుల్ కంపెయిన్: గుజరాత్ కంపెనీకి కలిసొచ్చిన ప్రచారం

కేరళ అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వంలో భాగంగా రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి అచ్యుతానందన్ వయసును ఉద్దేశించి మాట్లాడారు. 87 ఏళ్ల వయస్సులో ముఖ్యమంత్రిగా పరిపాలన సాగించడంపై రాహుల్ గాంధీ ఆరోపించారు. దీనికి స్పందించిన అచ్యుతానందన్ రాహుల్ గాంధీ అమూల్ బేబీ అని, నలభై ఏళ్లుగా ఆయన ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. అచ్యుతానందన్ అమూల్ బేబీ అనడంతో గుజరాత్‌కు చెందిన అమూల్ కంపెనీ దానిని తన ప్రచారానికి వినియోగించుకుంది. వారి వ్యాఖ్యలతో అ కంపెనీ ఆనందంలో తేలియాడుతోంది. వారి వ్యాఖ్యల ద్వారా దేశవ్యాప్తంగా తమకు మరింత ప్రచారం జరిగిందని సంబరపడుతోంది.












Click it and Unblock the Notifications