• search
  • Live TV
కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

వైయస్ జగన్ కోటల్లో కాంగ్రెసు ప్లాన్, రిగ్గింగ్ నిరోధానికి యత్నం

By Pratap
|

YS Jagan
కడప: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి వైయస్ జగన్‌కు కడప లోకసభ నియోజకవర్గంలో పెట్టని కోటల్లా ఉన్న ప్రాంతాల్లో రిగ్గింగ్ నిరోధానికి కాంగ్రెసు నాయకత్వం తగిన ప్రణాళికను రచిస్తోంది. కడప లోకసభ నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ స్థానాలకు డజను మందికి పైగా మంత్రులను ఇంచార్జీలుగా వేసిన కాంగ్రెసు నాయకత్వం ఇప్పుడు స్థానిక నాయకులను తన వైపు తిప్పుకునే ప్రయత్నాలు సాగిస్తోంది. జగన్‌తోనూ ఇతర పార్టీలతోనూ ఉన్న స్థానిక నాయకులను తన వైపు తిప్పుకునేందుకు కార్యాచరణ రూపొందించింది.

జమ్మలమడుగు, బద్వేలు, కడప శాసనసభా స్థానాల పరిధిలోని స్థానిక నాయకులపై కాంగ్రెసు దృష్టి పెట్టింది. 2009 ఎన్నికల్లో జగన్ విజయానికి సహకరించినవారిని బుజ్జగిస్తోంది. తమ పార్టీ ఏ మాత్రం లేని ప్రాంతాల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ, ఇతర పార్టీలు పోలింగ్ అక్రమాలకు పాల్పడకుండా చూసేందుకు తగిన చర్యలు చేపట్టినట్లు కాంగ్రెసు నాయకులు చెబుతున్నారు.

వైయస్ జగన్ కాంగ్రెసు పార్టీ నుంచి తెగదెంపులు చేసుకున్న తర్వాత స్థానిక కాంగ్రెసు నాయకులు ఆయన వైపు వెళ్లారు. దాంతో వారిని తిరిగి కాంగ్రెసులోకి తేవడానికి కాంగ్రెసు పార్టీ నిరంతరాయంగా ప్రయత్నాలు చేస్తోంది. దాంతో కొంత మందిని తన వైపు తిప్పుకోగలిగింది. జమ్మలమడుగు శాసనసభ స్థానానికి జగన్ వర్గానికి చెందిన ఆదినారాయణ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దాంతో ఈ నియోజకవర్గంలోని చాలా మంది స్థానిక నాయకులను తమ వైపు తిప్పుకోగలిగామని కాంగ్రెసు నాయకులు అంటున్నారు.

English summary
The state Congress is working overtime to strengthen its network in the areas which are considered strongholds of YS Jaganmohan Reddy in the Kadapa Lok Sabha constituency to prevent rigging in the byelection.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X