డబ్బులు తీసుకొని జగన్‌కు ఓటు వేయండి: అభ్యర్థిస్తున్న కొండా సురేఖ

Konda Surekha
కడప: మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని గెలిపించడానికి కడప ప్రజలు సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి, కాంగ్రెసు పార్టీ అసంతృప్త శాసనసభ్యురాలు కొండా సురేఖ ఆదివారం కడప జిల్లా ప్రచారంలో అన్నారు. కాంగ్రెసు పార్టీ అయినా, టిడిపి పార్టీ అయినా డబ్బులు ఇస్తే తీసుకోండని అయితే ఓటు మాత్రం జగన్‌కు వేయమని సూచిస్తున్నారు.

మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి తన మంత్రి పదవికి ఎందుకు రాజీనామా చేయలేదని ఆమె ప్రశ్నించారు. రాజీనామా ఎందుకు చేయలేదో ప్రజలకు చెప్పవలసిన అవసరం డిఎల్‌కు ఉందన్నారు. ఆధిక్యం సాధించే దిశలో డిఎల్ సవాల్ స్వీకరించాలన్నారు. ఎన్నికలలో భారీగా డబ్బులు ఖర్చు పెట్టడానికి కాంగ్రెసు పార్టీ సిద్ధమయిందని చెప్పారు. ఇప్పటికే రూ.150 కోట్లను కడపకు తరలించిందని ఆరోపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+