బుడ్డోడికి అంత సీన్ లేదు.. ఓవర్‌హైప్ చేయకండి: కపిల్ దేవ్

భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. వైభవ్ సూర్యవంశీలో సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ స్థాయి అసాధారణ ప్రతిభ ఉందని ఆయన ప్రశంసించారు. అయితే అదే సమయంలో ఈ యువ ప్లేయర్‌పై సోషల్ మీడియాలో, బయట జరగుతున్న ప్రచారాన్ని తగ్గించాలని కపిల్ దేవ్ సూచించారు. ఇంత చిన్న వయస్సులోనే వైభవ్ సూర్యవంశీపై అవసరానికి మించి అంచనాల భారాన్ని మోపడం సరికాదని.. దీని వల్ల అతను మానసిక ఒత్తిడికి గురయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

వైభవ్ సూర్యవంశీ ప్రతిభ గురించి కపిల్ దేవ్‌ను ప్రశ్నించగా.. అతడికి అద్భుతమైన టాలెంట్ ఉందని.. అందులో ఎలాంటి సంగేహం లేదని ఆయన స్పష్టం చేశారు. కానీ ప్రస్తుతం వైభవ్ గురించి అవసరానికి ముంచి పెద్ద మాటలు మాట్లాడుకుంటున్నామని అభిప్రాయపడ్డారు. వైభవ్ సూర్యవంశీకి కాస్త సమయం ఇవ్వాలని.. ఇప్పుడే అతడిని ఆకాశానికి ఎత్తేసి అనవసరమైన ఒత్తిడిలోకి నెట్టవద్దని సూచించారు. కేవలం టాలెంట్ ఉంటే సరిపోదని.. అంతర్జాతీయ స్థాయిలో ఎక్కువకాలం స్థిరంగా ఆడినప్పుడే ఏ ఆటగాడైనా గొప్పవాడిగా మారుతాడని కపిల్ దేవ్ గుర్తు చేశారు. వైభవ్ సూర్యవంశీకి అద్భుతమైన సామర్థ్యం ఉందని.. టాలెంట్ పరంగా చూస్తే అతను సచిన్, విరాట్ కోహ్లీలతో సమానమేనని ప్రశంసించారు.

Kapil Dev Warns About Pressure on Young Batter Don t Overhype Vaibhav Sooryavanshi Details

చిన్న వయసులోనే వైభవ్ సూర్యవంశీ టీ20 క్రికెట్లో చూపించిన ఇంపాక్ట్ చాలా అరుదైనదని కపిల్ దేవ్ పేర్కొన్నారు. ఇంత తక్కువ వయసులో ఇలాంటి ఆటతీరును ప్రదర్శించే ఆటగాళ్లు ప్రపంచంలో కేవలం ఒకశాతం మాత్రమే ఉంటారని తెలిపారు. అయితే క్రికెట్లో అసలైన పరీక్ష టెస్ట్ క్రికెట్లోనే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. వైభవ్ సూర్యవంశీ టెస్ట్ క్రికెట్ ఆడేటప్పుడు కూడా ఇదే విధమైన స్థిరత్వాన్ని చూపించగలడా అనేది భవిష్యత్తులో తేలాల్సి ఉందన్నారు.

ఈ సందర్భంగా సచిన్ టెండూల్కర్ డెబ్యూ చేసిన రోజులను కపిల్ దేవ్ గుర్తుచేసుకున్నారు. 1988-89 కాలంలో సచిన్ టెండూల్కర్ భారత జట్టులోకి వచ్చినప్పుడు ఆయన చుట్టూ ఇంత హడావిడి, శబ్ధం లేదని చెప్పారు. ఇప్పుడు వైభవ్ సూర్యవంశీ చుట్టూ ఉన్నంత హైప్ అప్పట్లో సచిన్‌కు కూడా లేదని.. కాబట్టి అతనికి ఓ సాధారణమైన వాతావరణాన్ని ఇవ్వడం చాలా ముఖ్యమని నెటిజన్లకు, మీడియాకు సూచించారు.

ఇక వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ అరంగేట్రంపై జరుగుతున్న చర్చకు కపిల్ దేవ్ సూటిగా సమాధానమిచ్చారు. ఒకవేళ ఆ కుర్రాడు అంతర్జాతీయ క్రికెట్ ఆడటానికి సిద్ధంగా ఉంటే.. ఇక ఆలస్యం చేయకుండా తుది జట్టులోకి తీసుకోవాలని అన్నారు. "చాలా మంది ఇంకా తొందరైపోతుందేమో అని అడుగుతున్నారు. కానీ నేనంటాను.. ఇప్పటికే చాలా ఆలస్యం కాలేదా? అతను సిద్ధంగా ఉంటే ఆడేందుకు అవకాశం ఇవ్వాలి" అని కపిల్ దేవ్ సూచించారు. అయితే సెలక్షన్‌తో పాటు వైభవ్ సూర్యవంశీ మానసిక ఎదుగుదలను కూడా దృష్టిలో ఉంచుకోవాలని.. దయచేసి అతడిని ఓవర్‌హైప్ చేయొద్దని భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+