"బెదిరింపులతో ఏమీ మార్చలేరు"- పాక్ కు భారత్ ఘాటు కౌంటర్..!
కశ్మీర్లో పహల్గాం ఉగ్రదాడుల తర్వాత పాకిస్తాన్ (Pakistan) కు నిలిపేసిన సింధు జలాల ఒప్పందాన్ని (Indus Waters Treaty) అమలు చేయాల్సిందేనంటూ ఈ మధ్య వరుసగా పొరుగు దేశం బెదిరింపులకు దిగుతోంది. సింధు జలాలు వదలకపోతే యుద్దానికి సైతం సిద్దమంటూ ప్రకటనలు చేస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్రం ఇవాళ మరోసారి పాకిస్తాన్ కు ఘాటు కౌంటర్ ఇచ్చింది. సింధు జలాల విషయంలో పొరుగుదేశం బెదిరింపులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ విదేశాంగశాఖ ఓ ప్రకటన చేసింది.
సింధు జలాల ఒప్పందం (IWT)పై పాకిస్థాన్ దూకుడు వైఖరి ఆపేంతవరకూ, సరిహద్దు ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడం ఆపేంత వరకు దీన్ని నిలిపివేయాలన్న భారతదేశ నిర్ణయంపై ఎలాంటి ప్రభావం చూపదని భారత్ ఇవాళ తేల్చిచెప్పేసింది. సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయాలని భారత్ నిర్ణయించినప్పటి నుంచీ సరిహద్దు నదులను పంచుకునే దేశాలకు భారత్ నిర్ణయం ఒక ప్రమాదకరమైన ఉదాహరణగా నిలుస్తుందని పాకిస్థాన్ అంతర్జాతీయ సమాజానికి అబద్ధాలు చెబుతూ వస్తోంది.

ఈ నేపథ్యంలో భారత్ ఇవాళ స్పందించింది. సరిహద్దు ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడం ఆపేంత వరకు ఏమీ మారదని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇవాళ పాకిస్థాన్‌కు గుర్తుచేసింది. సింధు జలాల ఒప్పందంపై భారతదేశ వైఖరి స్థిరంగా ఉందని, సరిహద్దు ఉగ్రవాదానికి పాకిస్థాన్ నిరంతరం మద్దతు ఇస్తున్నందుకు ప్రతిస్పందనగా సింధు జలాల ఒప్పందం నిలిపేసినట్లు తెలిపింది. పాకిస్థాన్ సరిహద్దు ఉగ్రవాదానికి తన మద్దతును విశ్వసనీయంగా, తిరుగులేని విధంగా విరమించుకోవాలని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు. సింధు జలాల ఒప్పందం విషయంలో అంతర్జాతీయ మద్దతు పొందే ప్రయత్నాల్లో భాగంగా, పాకిస్తాన్ ఉప ప్రధాని ఇషాక్ దార్ .. IWTని నిలిపివేయాలన్న భారతదేశ నిర్ణయాన్ని తమ దేశం తిరస్కరిస్తోందని తెలిపారు. అలాగే ఆ ఒప్పందం చెల్లుబాటులో, కట్టుబడి ఉండేదిగా అమలులో ఉందని గుర్తుచేశారు. కానీ భారత్ ఈ వాదనను ఇవాళ మరోసారి తోసిపుచ్చింది.














Click it and Unblock the Notifications