"నేను మాజీ సీఎంను.. ఇంతగా అవమానించాలా ?"-కర్నూలు జైల్లో ఘటనపై జగన్..!
ఏపీలో కూటమి సర్కార్ పై అలుపెరగని పోరాటాలు చేస్తున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ (YS Jagan)ను కట్టడి చేసేందుకు అందివచ్చిన ఏ అవకాశాన్నీ ప్రభుత్వం వదులుకోవడం లేదు. ఇవాళ కర్నూలు జిల్లా పర్యటనకు వచ్చిన జగన్.. జిల్లా జైల్లో ఉన్న తమ పార్టీ ఎమ్మెల్యే విరూపాక్షిని ములాఖత్ లో కలిశారు. అయితే ఈ సందర్భంగా ఓ అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. దీంతో జగన్ కూడా దీనిపై షాకయ్యారు. అనంతరం జైలు బయటికి వచ్చిన జగన్.. సీఎం చంద్రబాబుపై నిప్పులు చెరిగారు.
జైలు నుంచి బయటికి వచ్చిన తర్వాత జగన్ .. తాను ఓ మాజీ ముఖ్యమంత్రిని అని, తనను అవమానించారని సంచలన వ్యాఖ్యలు చేశారు. జైల్లో లోపలికి వెళ్లేందుకు లోపలికి వెళ్లేందుకు కెమెరాతో ఫొటో తీసుకుంటారని, అలాగే తనను కూడా తీసుకుంటారని భావించినట్లు తెలిపారు. ఎవరినైనా లోపలికి అనుమతించేందుకు లోపల తీసుకెళ్లి కూర్చోబెట్టి ఫొటో తీసుకుంటారని, కానీ తనను గ్రిల్ బయట నిలబెట్టి ఫొటో తీసుకుని పంపారన్నారు. చంద్రబాబు శాడిస్టిక్ మనస్తత్వం అలా ఉందన్నారు. తాను జైలు అధికారుల్ని అందరినీ ఇలాగే ఫొటో తీస్తారా అని అడిగానని, కానీ వారు మాత్రం పై స్థాయి నుంచి ఆదేశాలు వచ్చినట్లు తనకు చెప్పారన్నారు.

తమ ప్రభుత్వ హయాంలో పీపుల్ ఫ్రెండ్లీ పోలీసు స్టేషన్లు ఏర్పాటు చేశామని జగన్ గుర్తుచేసారు. ఎవరైనా స్టేషన్ కు ఫిర్యాదు చేసేందుకు వస్తే వారిని కూర్చోబెట్టి చిరునవ్వుతో ఫిర్యాదు తీసుకునే వ్యవస్థ ఏర్పాటు చేశామన్నారు. కానీ ఇక్కడ మాత్రం అవమానించేలా చేశారన్నారు. జైలు అధికారులని తాను అడిగితే.. తనను నిలబెట్టి ఫొటో తీయాలని ఆదేశాలు వచ్చినట్లు చెప్పారని జగన్ తెలిపారు. రేపు పొద్దున్న ఎల్లకాలం మీ ప్రభుత్వమే ఉండదని, ఏదయితే విత్తుతున్నారో అవే పండ్లు అవుతాయన్నారు. తప్పుడు సంప్రదాయాన్ని మొదలుపెడుతున్నారో, అది రెండింతలై మీకు చుట్టుకుంటాయని చంద్రబాబుకు జగన్ హెచ్చరికలు చేసారు. చూస్తూ చూస్తూ రెండేళ్లు అయిపోయాయని, మరో మూడేళ్ల కూడా అయిపోతాన్నారు.















Click it and Unblock the Notifications