సొంత పార్టీ ఎంపీకి సువేందు బిగ్ షాక్..! ఆ ప్రతిష్టాత్మక అవార్డు వెనక్కి..!
పశ్చిమ బెంగాల్ లో ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి తొలిసారి అధికారంలోకి వచ్చిన సువేందు అధికారి (Suvendu Adhikari) ప్రభుత్వం.. నిత్యం ఏదో ఒక సంచలన నిర్ణయం తీసుకుంటూనే ఉంది. తద్వారా నిత్యం వార్తల్లో ఉండేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా సీఎం సువేందు అధికారి తన సొంత పార్టీ బీజేపీకి చెందిన ఓ ఎంపీకి గత ప్రభుత్వం ఇచ్చిన ఓ అవార్డును వెనక్కి తీసుకోవాలని సంచలన నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఈ పరిణామం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది.
ఇంతకీ ఏం జరిగిందంటే.. బెంగాలీయులకు ఆరాధ్యుడైన నేతాజీ సుభాష్ చంద్రబోస్ ను యుద్ద నేరస్తుడని అభివర్ణిస్తూ బీజేపీ ఎంపీ నాగేంద్ర రే (Nagendra ray) సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయనతో పాటు సువేందు ప్రభుత్వం కూడా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో గతంలో ఎంపీ నాగేంద్ర రాయ్ కు ఆయన చేసిన సేవలకు గానూ మమతా బెనర్జీ ప్రభుత్వం ఇచ్చిన బంగ విభూషణ్ (Banga Bibhushan) అవార్డును వెనక్కి తీసుకోవాలని సువేందు ప్రభుత్వం నిర్ణయించింది. అంతకు ముందు సోషల్ మీడియాలో నేతాజీపై అగౌరవకరమైన వ్యాఖ్యలు చేసేవారిపై అరెస్టులతో సహా కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం సువేందు అధికారి పోలీసుల్ని ఆదేశించారు. అది ఎమ్మెల్యే అయినా, ఎంపీ, అయినా, ప్రభుత్వ అధికారి అయినా అంటూ తేల్చిచెప్పారు.

సువేందు ఈ ట్వీట్ చేసిన 24 గంటల లోపే అనంత మహరాజ్ (Ananta Maharaj)గా కూడా పిలుచుకునే ఎంపీ నాగేంద్ర రేకు ఇచ్చిన అవార్డు వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. తాజాగా ఎంపీ నాగేంద్ర రే .. నేతాజీని యుద్ధ నేరస్థుడుడిగా అభివర్ణించడం, భారత స్వాతంత్ర్య పోరాటంలో ఆయన నాయకత్వం, ఆజాద్ హింద్ ఫౌజ్ పాత్రను ప్రశ్నించడం వంటి వ్యాఖ్యలు చేశారు. దీంతో ప్రభుత్వం అవార్డు వెనక్కి తీసుకుంది. రాష్ట్రానికి , ప్రజలకు విశిష్టమైన , ఆదర్శప్రాయమైన సేవలు అందించిన వారికి ఈ పురస్కారం ఇస్తారని, దీనికి అత్యున్నత స్థాయి గౌరవం, ప్రతిష్ట ఉన్నాయని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. నాగేంద్ర రే ఈ గౌరవాన్ని ఇంకా కలిగి ఉండటంపై ప్రశ్నలు లేవనెత్తేలా కొన్ని వాస్తవాలు , పరిస్థితులు తలెత్తాయని ప్రభుత్వం తన ప్రకటనలో పేర్కొంది.













Click it and Unblock the Notifications