పాకిస్తాన్ వైమానిక దాడుల్ని ఖండించిన కేంద్రం..! కీలక వ్యాఖ్యలు..!
పాకిస్తాన్ (Pakistan)కూ, పొరుగున ఉన్న ఆప్ఘనిస్తాన్ (Afganistan) కూ మధ్య గత కొంతకాలంగా తీవ్ర ఉద్రిక్తతలు నెలకున్నాయి. ఇందులో భాగంగా ఈ మధ్య దాడులు, ప్రతిదాడులు కూడా పెరిగాయి. తాజాగా పాకిస్తాన్ ఆప్ఘనిస్తాన్ పై వైమానిక దాడులకు సైతం దిగింది. ఈ దాడుల్లో 36 మంది ఆప్ఘన్ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. దీనిపై భారత్ (India) ఇవాళ ఘాటుగా స్పందించింది. వీటిని ఆప్ఘనిస్తాన్ సార్వభౌమాధికారంపై దాడిగా, ప్రాంతీయ శాంతికి ముప్పుగా మన విదేశాంగశాఖ అభివర్ణించింది.
ఆప్ఘనిస్తాన్ సార్వభౌమత్వానికి, ప్రాదేశిక సమగ్రతకు భారత్ తమ మద్దతును పునరుద్ఘాటించింది. ఆఫ్ఘన్ ప్రజలకు తమ మానవతా, అభివృద్ధి సహాయాన్ని కొనసాగిస్తామని విదేశాంగశాఖ ప్రతినిధి రణ్ ధీర్ జైశ్వాల్ స్పష్టం చేశారు. మానవతా సహాయం, అభివృద్ధి సహకారం ద్వారా ఆఫ్ఘనిస్తాన్‌కు మద్దతు ఇవ్వడానికి భారత్ కట్టుబడి ఉందని ఉందన్నారు. సరిహద్దు వెంబడి జరిగిన వరుస సైనిక దాడుల నేపథ్యంలో పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న తరుణంలో భారత్ ఈ వ్యాఖ్యలు చేసింది.

నిన్న ఉగ్రవాద దాడుల నుండి తమను తాము రక్షించుకునే పాకిస్తాన్ హక్కుకు వాషింగ్టన్ మద్దతు ఇస్తుందని, అదే సమయంలో ఉగ్రవాదం కారణంగా పాకిస్తాన్ ప్రజలు గణనీయంగా నష్టపోయారని అమెరికా విదేశాంగ శాఖ పేర్కొంది. గత కొన్నేళ్లుగా ఈ రెండు పొరుగు దేశాల మధ్య జరిగిన అత్యంత తీవ్రమైన దాడుల్లో తాజా ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ఐక్యరాజ్యసమితి ప్రకారం, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు వెంబడి పాకిస్తాన్ జరిపిన వైమానిక దాడులలో కనీసం 28 మంది పౌరులు మరణించగా, మరో 49 మంది గాయపడ్డారు. దీనికి ప్రతిస్పందనగా పాకిస్తానీ భూభాగంలోకి తాము ప్రతీకార వైమానిక దాడులు జరిపినట్లు ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ ప్రభుత్వం ప్రకటించింది.














Click it and Unblock the Notifications