మెరుగు పడుతుందని చెప్పలేం: బాబా ఆరోగ్యంపై రమేష్

రోజూ బాబా ఆరోగ్యం నిలకడగా ఉందని, అయినా ఆందోళనకరంగా లేదని చెప్పలేమని, ఇంకా వెంటిలేటర్ పైనే శ్వాస అందిస్తున్నామని కాలేయం పని తీరు మెరుగు పడిందని మళ్లీ తరువాతి రోజే కాలేయం పనితీరు నెమ్మదిగా ఉందని చెబుతూ భక్తులను ఆందోళనకు గురి చేస్తున్నారు. అవయవాలు సరిగా పని చేస్తున్నాయని చెప్పి తాజాగా అవయవాల పనితీరు మందగించిందని పొంతన లేని మాటలు చెపుతున్నారు.
డాక్టర్ సఫయా, రవిరాజ్‌ల బులెటిన్‌కు భిన్నంగా మంగళవారం సాయంత్రం ప్రభుత్వం హెల్త్ సెక్రటరీ రమేష్ మరో విధంగా చెప్పారు. బాబా కోమాలోకి వెళ్లారని చెప్పారు. వెంటిలెటర్ ద్వారానే శ్వాస అందిస్తున్నట్టు చెప్పారు. ఇంకా సపోర్టు సిస్టమ్స్ ద్వారానే బాబా అవయవాలు పని చేస్తున్నాయని, బాబా ఆరోగ్యం నిలకడగా ఉందని, అయితే 85 ఏళ్ల బాబా ఆరోగ్యం మెరుగు పడుతుందని మాత్రం ఖచ్చితంగా చెప్పలేమని భక్తులను మరింత ఆందోళనకు గురి చేశారు.












Click it and Unblock the Notifications