కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సాక్షి మీడియా కథనాలను తీవ్రంగానే పరిగణిస్తున్నాం: అక్షయ్ రావత్

By Pratap
|
Google Oneindia TeluguNews

Sakshi
న్యూఢిల్లీ: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కడప పార్లమెంటరీ స్థానం అభ్యర్థి జగన్‌కు చెందిన దినపత్రిక, ఛానల్‌లలో వస్తున్న కథనాలను తాము తీవ్రంగా పరిగణిస్తున్నామని కేంద్ర ఎన్నికల సంఘం డైరెక్టర్ జనరల్(డీజీ) అక్షయ్ రావత్ వెల్లడించారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు అనుకూలంగా వారి సొంత ఛానెళ్లు, పత్రికల్లో వస్తున్న కథనాలపై తాము త్వరలోనే స్పష్టమైన విధివిధానాలను రూపొందిస్తామని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో స్పష్టం చేశారు.

జగన్‌కు అనుకూలంగా వస్తున్న వార్తలన్నింటినీ పెయిడ్ న్యూస్‌గా పరిగణించి, ఎన్నికల ఖర్చులో లెక్కించాలని టీడీపీపీ నేత నామా నాగేశ్వరావు ఈసీని ఇటీవల కోరారు. దీనిపై విలేకరుల సమావేశంలో ప్రశ్నించగా- దేశంలో చాలా మంది రాజకీయ నేతలకు సొంత ఛానెళ్లు, పత్రికలు ఉన్నాయని, మరికొందరికి అనుకూల మీడియా ఉందని చెప్పారు. ఈ అంశంపై ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో స్పష్టమైన విధానాలను రూపొందించి, చర్యలు తీసుకుంటామని తెలిపారు.

English summary
Election Commission DG Akshay Rawath said that they are taking YS Jagan's Sakshi media reports into consideration. He said that they are framing certain rules for the media.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X