బాబాకు అవయవదానం చేస్తా: డా సఫయాకు లేఖ ఇచ్చిన గణపతిరాజు

Sathya Saibaba
అనంతపురం: భగవాన్ శ్రీ సత్యసాయిబాబా ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందని తెలియడంతో సత్యసాయిబాబా మేనమామ తనయుడు గణపతిరాజు తాను బాబాకు అవయవ దానం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. బాబాకు మూత్రపిండాలు తదితర అవయవాలు సమస్యగా ఉన్నాయని తెలియడంతో అవయవ దానం చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని సిమ్స్ డైరెక్టర్ డాక్టర్ సఫయాకు వినతి పత్రం ఇచ్చినట్టుగా తెలుస్తోంది. బాబాకు అవసరమైన ఏ అవయవాన్నైనా తాను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన ప్రకటించారు. బంధువులను, భక్తులను లోనికి రానివ్వడం లేదని అందుకే తాను డాక్టర్ల వద్దకు నేరుగా వెళ్లి చెప్పే అవకాశం లేనందునే మీడియా ద్వారా డాక్టర్లకు అవయవదానానికి సిద్ధంగా ఉన్నట్టు ప్రకటిస్తున్నట్టుగా చెప్పారు.

కాగా అనంతపురం జిల్లాలో బాబా ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తెలియడంతో జిల్లా ఎస్పీ షాన్‌వాజ్ హుస్సేన్ ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. శాంతి భద్రతల నిమిత్తం భారీగా పోలీసులను రంగంలోకి దించుతున్నారు. జిల్లా వ్యాప్తంగా పోలీసులను ఉన్నతాధికారులు అప్రమత్తం చేశారు. వెంటనే పుట్టపర్తి రావాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. బాబా ఆరోగ్యం విషమంగా ఉందని తెలియడంతో భక్తులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. బాబాను వెంటనే తమకు చూపించాలని డిమాండ్ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+