వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అవినీతికి వ్యతిరేకంగా యోగా గురు బాబా రామ్‌దేవ్ సత్యాగ్రహం

By Pratap
|
Google Oneindia TeluguNews

Baba Ramdev
న్యూఢిల్లీ: యోగా గురు బాబా రామ్‌దేవ్ జూన్ 4వ తేదీ నుంచి అవినీతికి వ్యతిరేకంగా సత్యాగ్రహం పేరుతో ప్రజా ఉద్యమాన్ని చేపట్టనున్నారు. రామ్‌దేవ్ అధికార ప్రతినిధి ఒకరు ఈ విషయం చెప్పారు. భారత్ స్వాభిమాన్ యాత్ర పూర్తయిన తర్వాత రామ్‌దేవ్ సత్యాగ్రహ ఉద్యమాన్ని చేపడుతారు. స్వాభిమాన్ యాత్రను ఆయన నిరుడు సెప్టెంబర్ 2వ తేదీన ద్వారకలో ప్రారంభించారు. అది మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినీలో జూన్ 1వ తేదీన ముగుస్తుంది.

అవినీతి వ్యతిరేక పోరాటం గురించి రామ్‌దేవ్ ఏప్రిల్ 2వ తేదీన ప్రకటన చేస్తారు. మూడు అంశాలపై బాబా రామ్‌దేవ్ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌కు లేఖ రాశారు. స్వతంత్ర నిష్పాక్షిక లోక్‌పాల్‌ను ఏర్పాటు చేయాలని, విదేశీ బ్యాంకుల్లో మూలుగుతున్న 400 కోట్ల రూపాయల విలువ చేసే నల్లధనాన్ని దేశానికి రప్పించాలని, బ్రిటిష్ వ్యవస్థలోని పాలన, పన్నుల విధానం, విద్య, శాంతిభద్రతల స్థానంలో స్వదేశీ నమూనాలను ప్రవేశపెట్టాలని ఆయన ప్రధానిని కోరారు.

English summary
Yoga guru and spiritual leader Baba Ramdev will launch a nationwide people's movement 'Satyagraha against corruption' from June 4, his spokesperson said here Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X