కడప ఉప ఎన్నికల్లో భారీగా ధన ప్రవాహం: రూ.6.7 లక్షలు స్వాధీనం

శుక్రవారం కూడా పోలీసులు ప్రొద్దుటూరు మండలం గోపల్లె వద్ద ఓ బస్సులో నుండి రూ.6.7 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. రెండు రోజుల క్రితం కూడా ఓ జీపులో లక్షల రూపాయలు కాలిపోయిన సంఘటన వెలుగులోకి వచ్చింది. అంతకు ముందు కూడా పోలీసులు రెండు లక్షలను పట్టుకున్నారు. ఇలా ఎన్నికల హడావుడి ప్రారంభమైనప్పటి నుండి కడప జిల్లాలో పోలీసులు రూ.14 లక్షలను ఇప్పటి వరకు పట్టుకున్నారు. అయితే తెలియకుండా కోట్లాది రూపాయలే వెళుతున్నట్లుగా తెలుస్తోంది. అందుకే ఈసి రూ.50 వేలు బ్యాంకు నుండి డ్రా చేసే వ్యక్తుల పేర్లు వెల్లడించాలని బ్యాంకు అధికారులను ఆదేశించింది.












Click it and Unblock the Notifications