వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒబామాను మించిన ధోనీ: టైమ్ టాప్‌ హండ్రెడ్‌లో మహేంద్రుడు

By Srinivas
|
Google Oneindia TeluguNews

MS Dhoni
న్యూయార్క్: అత్యంత ప్రభావ శీల వ్యక్తుల జాబితాను ప్రకటించే టైమ్ టాప్-100లో భారత జట్టు క్రికెట్ సారథి మహేంద్ర సింగ్ ధోనీ స్థానం సంపాదించుకున్నాడు. ఆ జాబితాలో చోటు సంపాదించుకోవడమే కాదు అగ్ర రాజ్య అధ్యక్షుడు బరాక్ ఒబామా కన్నా ముందు నిలిచాడు. టైమ్ టాప్-100 ప్రకటించిన జాబితాలో ఒబామా 82వ స్థానం సంపాదించుకుంటే మన ధోనీ 52వ స్థానంలో నిలిచాడు. ధోనీ ప్రపంచ కప్ సాధించి పెట్టడంతో ఇమేజ్ అమాంతం పెరిగి పోయింది. టాప్-100లో ధోనీతో సహా ఐదుగురు భారతీయులకు చోటు దక్కింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ 61వ స్థానంలో ఉన్నారు. వీరితో పాటు విప్రో అధినేత అజీం ప్రేమ్‌జీ, సామాజిక కార్యకర్త అరుణారాయ్‌, న్యూరో శాస్త్రవేత్త విఎస్ రామచంద్రన్ ఉన్నారు. రామచంద్రన్ ఒక్కరు మాత్రం భారత సంతతికి చెందిన కాలిఫోర్నియా వాసి.

ఇక మొదటి స్థానం ఈజిప్టు తిరుగుబాటు ఉద్యమంలో కీలకంగా నిలిచిన వేల్ ఘోనిమ్ నిలిచారు. కాగా వేల్ గూగుల్ ఉద్యోగి. మరో విశేషం ఏమంటే బరాక్ ఒబామా ఆయన భార్య మిచెల్ కన్నా చాలా వెనుక నిలిచారు. ప్రభావశీల వ్యక్తులలో భర్తను దాటి మిచెల్ 22వ స్థానంలో నిలిచారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ భార్య హిల్లరీ క్లింటన్ 43వ స్థానంలో నిలిచారు.

English summary
Led by India's "Captain Fantastic" Mahendra Singh Dhoni, five Indians have made it to the Time magazine's 100 most influential people in the world, whose "ideas spark dialogue and dissent and sometimes even revolution."
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X