వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సత్యసాయి బాబాను చూపించాలని శివ సాయిబాబా ధర్నా, అరెస్టు

తాను చిన్నప్పుడు సత్య సాయిబాబాను దర్శించుకున్నానని, తనను సత్య సాయిబాబా ఆయన ప్రతిరూపంగా చెప్పారని శివసాయి బాబా అన్నారు. పోలీసుల తీరు పట్ల ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, స్థానిక ఉజ్వల అతిథి గృహంలో సత్య సాయిబాబా ట్రస్టు సభ్యులు స్థానిక రాజకీయ నాయకులతో సమావేశమయ్యారు. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో సత్యసాయి సెంట్రల్ ట్రస్టు సభ్యులు సమావేశమయ్యారు. పుట్టపర్తికి పొరుగు జిల్లాల నుంచి పెద్ద యెత్తున పోలీసులను పిలిపిస్తున్నారు. పుట్టపర్తిలో నిషేధాజ్ఢలు విధించారు.