భారీ స్క్రీన్లు, పోలీసు బలగాలు: ఏర్పాట్లన్నీ అంతిమ యాత్రకేనా?

ఇప్పటికే ఖాకీ వనంగా మారిన పుట్టపర్తిలో మరిన్ని వేల పోలీసు బలగాలను మోహరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఐజి స్థాయి అధికారి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. పలువురు డిఐజిలు అక్కడే మకాం వేశారు. కర్ణాటక అధికారుల బృందం కూడా పుట్టపర్తి బయలు దేరింది. పుట్టపర్తిలో ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లు దిగేందుకు జిఏడి అధికారులు పర్యవేక్షిస్తున్నారు. బాబాను చూడటానికి ప్రధాని మన్మోహన్ సింగ్, రాష్ట్రపతి ప్రతిభా పాటిల్‌తో పాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, కేంద్ర మంత్రులు రానున్నట్లుగా తెలుస్తోంది.
కాగా ఇప్పటికీ బాబా ఆరోగ్యం విషమంగానే ఉన్నట్లుగా తెలుస్తోంది. బాబా ఆరోగ్యం వైద్యానికి ఏ మాత్రం సహకరించడం లేదని తెలుస్తోంది. సిఆర్ఆర్టీ ద్వారానే డయాలసిస్ కొనసాగిస్తున్నారు. ఉదయం డాక్టర్లు విడుదల చేసిన బులెటిన్ కూడా బాబా పరిస్థితి విషమంగానే ఉన్నట్టు తెలుపుతుంది.












Click it and Unblock the Notifications