సత్యసాయి భక్తులను చీట్ చేశారు: బంగ్లాదేశ్ రచయిత్రి తస్లీమా నస్రీన్

కోట్లాది భక్తులను విడిచి వెళ్లిన తర్వాత కూడా ఆయనను వివాదాలు వీడనట్టుగా కనిపిస్తోంది. ఆయన మరణం తర్వాత చాలామంది ఆయన సాధారణ వ్యక్తియా లేక భగవత్ స్వరూపుడా అని ప్రశ్నించుకున్నారు. అయితే దానికి భక్తులు భగవత్ స్వరూపుడనే సమాధానం ఇస్తారు. అయితే విమర్శకులు మాత్రం ఇప్పటికీ ఆయన సూపర్ మ్యాజిక్ పవర్ మీద ప్రశ్నలు సంధిస్తున్నారు.
ప్రముఖ రచయిత తస్లీమా నస్రీన్ కూడా బాబా మరణం తర్వాత తన ట్విట్టర్‌లో బాబా సాధారణ మానవమాత్రుడు. ఇంకా చెప్పాలంటే కోట్లాది ఇతని భక్తులను చీట్ చేశారని ట్విట్టర్‌లో పేర్కొన్నట్టుగా తెలుస్తోంది. బాబా గతంలో తాను 96 ఏళ్ల వయస్సులో, 2022లో మరణిస్తానని చెప్పారని గుర్తు చేశారు. అంతేకాదు చేసిన మంచి పనులు చూపించడం ద్వారా భక్తులను చీట్ చేశామనే విషయం నుండి తప్పించుకోలేరని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
సాయిబాబా 94 ఏళ్ల వయసులో మరణిస్తానని భక్తులను ఇచ్చిన మాట మీద నిలబడలేదని, అలాంటప్పుడు ఆయన దేవుడు ఎలా అవుతారని ఇప్పటికైనా ప్రజలు ఆయన దేవుడు కాదు మానవమాత్రుడు అని తెలుసుకోవాలని సూచించారు. అయినా బాబాను తస్లీమా నస్రీన్ ఒక్కరే విమర్శించలేదు. చాలామంది సత్యసాయిని విమర్శించారు. అయినా ఆయన తన సేవ పంథను మాత్రం వీడలేదు.












Click it and Unblock the Notifications