2జి స్కామ్ కేసు చార్జిషీట్‌లో కనిమొళి, కాంగ్రెసుపై డిఎంకె ఆగ్రహం?

దయాళ్ అమ్మాళ్ పేరును చార్జిషీట్‌లో చేరిస్తే మంత్రి వర్గం నుంచి తప్పుకోవాలని తమ ఆరుగురు కేంద్ర మంత్రులను కరుణానిధి ఆదేశించే అవకాశాలున్నట్లు వార్తలు వస్తున్నాయి. చార్జిషీట్‌లో తన తల్లి పేరు చేర్చే అవకాశాలున్నట్లు వచ్చిన వార్తలతో ఆమె కుమారుడు అళగిరి అసంతృప్తితో ఉన్నారుట. నిందితుల జాబితాలో తన తల్లి పేరు చేరిస్తే తాను ఎందుకు మంత్రివర్గంలో కొనసాగాలని ఆయన అడిగారు. ఈ స్థితి వల్ల దయాళ్ అమ్మాళ్ పేరును చార్జిషీట్‌లో చేర్చకూడదని చివరి నిమిషంలో నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా, మే 13వ తేదీ తమిళనాడు శాసనసభ ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు నిరీక్షించాలని డిఎంకె నాయకత్వం భావిస్తున్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications