ఇదీ కారణం: నాదెండ్ల షోకాజ్‌కు పోచారం శ్రీనివాస రెడ్డి వివరణ

అయితే గత శాసనమండలి ఎన్నికలలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థికి ఓటు వేసిన విషయం తెలిసిందే. గత నాలుగు నెలలుగా ఆయన ప్రత్యేక తెలంగాణపై తెలుగుదేశం పార్టీ వైఖరిని ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు తెలంగాణపై స్పష్టమైన వైఖరి ప్రకటించక పోవడం వల్లే తాను టిడిపిని వీడుతున్నట్టు చెప్పారు. అయితే ఆయన గత సాధారణ ఎన్నికలలో టిడిపి మ్యానిఫెస్టోలో పేర్కొన్నట్లుగా ప్రత్యేక తెలంగాణకు కట్టుబడి లేనందునే తాను వ్యతిరేకంగా ఓటు వేశాననే వివరణ ఇచ్చి ఉంటారని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications