గమ్యం సినిమా రచయిత గంధం నాగరాజు కన్నుమూత

Gamyam
హైదరాబాద్‌: ప్రముఖ సినీ రచయిత గంధం నాగరాజు అనారోగ్యంతో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం కన్నుమూశారు. మెదడు, కాలేయ సంబంధిత సమస్యలతో ఆయన గత రెండునెలలుగా బాధపడుతున్నారు. 'గమ్యం' సినిమాతో సినీ రచయితగా మారిన నాగరాజు 'బాణం', 'బెట్టింగ్‌ బంగార్రాజు' సినిమాలకూ రచయితగా పనిచేశారు. అంతకుముందు ఆయన పలు నాటకాలు, నవలలు రాశారు. నర్సరావు పేట వీరి సొంత వూరు.

నాగరాజు విపరీతంగా మద్యం సేవించేవాడు. దానివల్లనే ఆయన అనారోగ్యానికి గురైనట్లు భావిస్తున్నారు. అత్యంత ప్రతిభావంతుడైన నాగరాజు సకాలంలో రచనలను అందించకుండా ఇబ్బంది పెట్టేవారని అంటున్నారు. గమ్యం సినిమా తర్వాత ఆయన పలు అవకాశాలు వచ్చాయి. అయితే, సకాలంలో అందించకుండా ఇబ్బంది పెట్టడంతో విసిగిపోయేవారని చెబుతారు. నాటకానికి ఆయన నంది అవార్డు కూడా అందుకున్నారు. ఆయన రాసిన నవల స్థితప్రజ్ఝ పసిడి లంక స్వాతి పత్రిక పోటీల్లో బహుమతి కూడా పొందింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+