ఉప ఎన్నికల తర్వాత జరిగేది ఏమీ లేదు: కన్నా లక్ష్మీనారాయణ

Kanna Laxmi Narayana
కడప: పులివెందుల, కడప ఉప ఎన్నికలు దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి, మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్‌కు మధ్య జరుగుతున్న పోటీగా మంత్రి కన్నా లక్ష్మీనారాయణ గురువారం ఓ టీవీ ఛానల్ ముఖాముఖి కార్యక్రమంలో చెప్పారు. వైయస్ ఎప్పుడూ కాంగ్రెసును వ్యతిరేకించలేదన్నారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యంగా, ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ కుటుంబం పట్ల విశ్వసనీయత కలిగి వైయస్ ఉండేవారని చెప్పారు. కాంగ్రెసు పార్టీ నుండి బయటకు వెళ్లి సోనియాను విమర్శించడం ద్వారా తండ్రిని ఆత్మకు మానసిక క్షోభను కలిగిస్తున్నారని అన్నారు. మాట తప్పను, మడమ తిప్పను అని చెబుతున్న జగన్ చేసేవన్నీ అందుకు విరుద్ధంగానే ఉన్నాయన్నారు. తల్లి మీద, పెరిగిన వ్యవస్థ మీద కూడా జగన్‌కు గౌరవం లేదన్నారు.

ఉప ఎన్నికల తర్వాత ఏదో జరిగి పోతుందని అందరూ అనుకుంటున్నారని అయితే జగన్ రాజీనామా చేసి ఆరునెలలు అవుతుందని ఇన్నాళ్లు ఏమీ జరగనిది ఇప్పుడు ఏమవుతుందని ప్రశ్నించారు. ఈ ఆరునెలల్లో ఏమైనా తిరగబడిందా అని ప్రశ్నించారు. ఉప ఎన్నికలలో కాంగ్రెసు గెలుపు ఖాయమని చెప్పారు. దేశ రాజకీయాలు మారుస్తానని జగన్ అనడం తెలియనితనమే అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+