దొడ్డ మలూర్‌లో ప్రేమ సాయిగా పుట్టపర్తి సత్య సాయి బాబా అవతారం

Sathya Sai Baba
బెంగళూరు: పుట్టపర్తి సత్య సాయిబాబా కర్ణాటకలోని మాండ్యా జిల్లా దొడ్డమలూర్ గ్రామంలో ప్రేమ సాయిగా అవతరిస్తారని నమ్ముతున్నారు. ఈ చిన్నపాటి గ్రామం బెంగళూర్ - మైసూర్ రహదారి పక్కన ఉంటుంది. పుట్టపర్తి సత్య సాయి బాబా భక్తుడు శ్రీ సత్య సాయి - ఆనందసాయి అనే శీర్షికతో రాసిన పుస్తకంలో ప్రేమ సాయి అవతారం ఇక్కడే జరుగుతుందని చెప్పాడని గ్రామస్థులు విశ్వసిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కలియుగంలో తాను మూడు అవతారాలు ఎత్తుతానని, తాను షిర్డీ సాయి బాబా అవతారాన్ని అని, మూడో అవతారం ప్రేమసాయిగా ఈ గ్రామంలో జరుగుతుందని దొడ్డమలూర్ గ్రామాన్ని సందర్శించినప్పుడు సత్యసాయి బాబా తనకు చెప్పినట్లు ఆ భక్తుడు రాశాడు. తాను చిన్న ఇంటిలో జన్మిస్తానని 1960 దశకంలో గ్రామాన్ని సందర్శించినప్పుడు చెప్పారని తెలిపాడు.

కాగా, గ్రామంలో ఎవరు బాబా అవతారంగా చెప్పుకుంటారా అనే అయోమయం గ్రామంలో నెలకొన్నట్లు వార్తలు వచ్చాయి. సత్య సాయిబాబా అంచనా ప్రకారం ప్రేమ సాయి ఈ గ్రామంలో 2023లో పుడతాడని కృష్ణా చారిటబుల్ ట్రస్టు నడుపుతున్న రామదాసు అనే వ్యక్తి చెప్పినట్లు ఓ ఆంగ్ల దినపత్రిక రాసింది. తన వ్యక్తిగత సహాయకుడు నారాయణ్ కస్తూరి స్త్రీగా జన్మిస్తాడని, భద్రావతి నది సమీపంలోని ఆ గ్రామంలో జన్మించిన స్త్రీ గ్రామానికి చెందిన పురుషుడిని వివాహం చేసుకుని ప్రేమసాయికి జన్మ ఇస్తుందని సత్య సాయి చెప్పినట్లు ఆయన తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+