వైయస్ జగనే సమాధానం చెప్పాలి: బిజెపితో దోస్తీపై డి. శ్రీనివాస్

కడప ఉప ఎన్నికల్లో ప్రచారం చేయడానికి తమ పార్టీ సీనియర్ నేత వి. హనుమంత రావుకు తన అనుమతి అవసరం లేదని ఆయన అన్నారు. వైద్యుల సలహా మేరకు తాను ఉప ఎన్నికల ప్రచారానికి వెళ్లే విషయంపై ఆలోచన చేస్తానని ఆయన అన్నారు. ఆధారాలు లేకుండా తమ పార్టీ శాసనసభ్యులపై చర్యలు ఉండవని, ఆధారాలు ఉన్నాయి కాబట్టే నలుగురు శాసనసభ్యులకు షోకాజ్‌లు ఇచ్చామని, షోకాజ్‌లకు వారి నుంచి వివరణలు వచ్చాయని ఆయన చెప్పారు. వీడియో క్లిప్పింగులు, పత్రికా ప్రకటనలతో కూడిన ఆధారాలతో వారి వివరణలను పార్టీ అధిష్టానానికి పంపామని, అధిష్టానం చర్యలు తీసుకుంటుందని ఆయన చెప్పారు.
వైయస్ జగన్ అనాలోచిత నిర్ణయం వల్లనే ఉప ఎన్నికలు వచ్చాయని, ఎవరి మీదా కుట్ర చేయాల్సిన అవసరం తమకు లేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications