కాంగ్రెసు కుక్క చావు చావడం ఖాయం: టిఆర్ఎస్ ఎమ్మెల్యే కెటిఆర్

KT Rama Rao
మహబూబ్‌నగర్: మేలో తెలంగాణపై స్పష్టమైన వైఖరి ప్రకటించకుంటే కాంగ్రెసు పార్టీ కుక్క చావు చావడం ఖాయమని తెలంగాణ రాష్ట్ర సమితి సిరిసిల్ల శాసనసభ్యుడు కల్వకుంట్ల తారక రామారావు శుక్రవారం మహబూబ్‌నగర్‌లో ఓ టీవీ ఛానల్‌తో మాట్లాడుతూ చెప్పారు. టిఆర్ఎస్ దశాబ్ది ఉత్సవాల నేపథ్యంలో ఆయన అక్కడకు వెళ్లారు. సమీకరించు, పోరాడు అని చెప్పిన రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ పద్ధతిలో పోరాటం సాగిస్తున్నామని చెప్పారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు పోరాడుతామని చెప్పారు. తెలంగాణ అంశం కేంద్రం చేతిలో ఉందని మా చేతిలో ఉంటే తెల్ల వారే వరకు తీసుకు వచ్చే వారమని చెప్పారు.

స్వాతంత్రం రావడానికి సంవత్సరాలు పట్టింది, జార్ఖండ్ రాష్ట్రం కోసం 22 ఏళ్లు పోరాడారు. తెలంగాణ కూడా సాధించుకునే వరకు పోరాడుతామని చెప్పారు. మాట ఇచ్చి తప్పుతున్న కొన్ని పార్టీలు ఉండటం వల్లనే తెలంగాణ ఆలస్యమవుతుందని తెలుగుదేశం పార్టీను ఉద్దేశించి చెప్పారు. తెలంగాణ అంశం అనేది భగభగమండే అగ్నికణం వంటిదని చెప్పారు. తెలంగాణ కోసం ప్రజల గుండెలు మండుతున్నాయని చెప్పారు. రాష్ట్ర చరిత్రలో పార్టీ స్థాపించి విజయవంతంగా నడిపిన చరిత్ర నాడు ఎన్టీఆర్‌ది, నేడు కెసిఆర్‌ది అని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+