హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్, చిరుపై రాజశేఖర్, జీవిత ధ్వజం: కంటతడి పెట్టిన రాజశేఖర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Rajasekhar
హైదరాబాద్: మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తన తండ్రి వైయస్ సింపతీతో త్వరగా ముఖ్యమంత్రి కావాలని కలలు కంటున్నారని హీరో డాక్టర్ రాజశేఖర్, ఆయన సతీమణి జీవిత శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. పార్టీలో తానే ఫోకస్ కావాలని జగన్ అనుకుంటారని, ఇతరులు ఫోకస్ కావడం జగన్‌కు అసలూ ఇష్టం ఉండదని హీరో రాజశేఖర్ కంట తడి పెట్టారు. జగన్, ఆయన పార్టీ నేతలు తమని కావాలే దూరంగా ఉంచారని ఆరోపించారు. విజయవాడ జగన్ జలదీక్షలో తమకు వచ్చిన ప్రతిస్పందన చూసి జగన్ అసూయ పడ్డారన్నారు. జగన్ ముఖ్యమంత్రి కావాలనే స్వార్థంతోనే పార్టీ స్థాపించారని ఆరోపించారు. తండ్రి ఆశయాలు సరిగా అమలు చేయడం లేదని హైకమాండ్‌కు తప్పుగా చూపించి సిఎం కావాలని అనుకున్నారని అన్నారు. జగన్ చేసేది సరియైనదే అయితే ఆయన చిన్నాన్న వైయస్ వివేకానందరెడ్డి కాంగ్రెసులో ఎందుకు ఉంటారని అన్నారు.

ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవిని ఇప్పుడు కామెంట్ చేయడం అంటే చచ్చిన పామును కొట్టినట్లేనని అన్నారు. పిఆర్పీని స్థాపించి దానిని నడపలేక రెండున్నర సంవత్సరాలకే కాంగ్రెసు పార్టీలో కలిపేశారని అన్నారు. పార్టీని నడపడం చేతకాకనే విలీనం చేశారని అన్నారు. మొదటి నుండి కాంగ్రెసుకు వ్యతిరేకంగా ఉన్న చిరంజీవిని తీసుకోవడం విచారకరమన్నారు. పార్టీకి ఎంతో చేసిన తమను విస్మరించారని అన్నారు. ఎన్నో ఏళ్లుగా పార్టీకి సేవలందించి, త్యాగాలు చేసిన తమను విస్మరించారని ఆవేదన వ్యక్తం చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి, పిసిసి అధ్యక్షుడు డి శ్రీనివాస్, నాటి రాష్ట్ర ఇంఛార్జ్ వీరప్ప మొయిలీ ఆధ్వర్యంలోనే కాంగ్రెసులో చేరిన విషయం గుర్తు చేశారు. వైయస్ దూరం కావడం దురదృష్టకరం అన్నారు. చిరంజీవికి వ్యతిరేకంగా తాము అప్పుడు ఉన్నందునే మమ్మల్ని కాంగ్రెసులోకి ఆహ్వానించారని అన్నారు. గత సాధారణ ఎన్నికల్లో కూడా చిరంజీవికి పట్టున్న చోటనే తమ చోట ప్రచారం చేయించారని అన్నారు.

English summary
Hero Rajasekhar said today that they welcomed in congress as they opposing Chiranjeevi. He said it is unfortunate to them the YS dead. He blamed Chiranjeevi attitude on merger.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X