అక్బరుద్దీన్‌పై దాడి ఘటన: ఇర్ఫాన్ సహా ముగ్గురు మృతి

తీవ్రంగా గాయపడిన అక్బరుద్దీన్ సంతోష్‌నగర్‌లోని ఓవైసీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, హోం మంత్రి సబితా ఇంద్రా రెడ్డి, శాసనసభ డిప్యూటీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఆస్పత్రికి వచ్చారు. అక్బరుద్దీన్ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. దాడిని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు వైయస్ జగన్ ఖండించారు. ప్రభుత్వ వైఫల్యం వల్లనే అక్బరుద్దీన్‌పై దాడి జరిగిందని చంద్రబాబు విమర్శించారు. శాసనసభ్యుడికే రక్షణ లేకపోతే సామాన్యులకు ఏ విధమైన రక్షణ ఉంటుందని తెలుగుదేశం శాసనసభ్యుడు నాగం జనార్దన్ రెడ్డి ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications