చంద్రబాబును అడ్డుకున్న జగన్ పార్టీ వైయస్సార్ కాంగ్రెసు నేతలు

Chandrababu Naidu
కడప: కడప లోకసభ స్థానంలో ప్రచారం సాగిస్తున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి చేదు అనుభవం ఎదురైంది. పులివెందుల శాసనసభా నియోజకవర్గం పరిధిలోని కోమునూతల గ్రామంలో చంద్రబాబు ప్రచారానికి వచ్చినప్పుడు శనివారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గ్రామంలోకి రాకుండా చంద్రబాబును వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేశారు.

చంద్రబాబు కాన్వాయ్‌పై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు రాళ్లు రువ్వారు. ఈ సమయంలో తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగింది. ఇరువర్గాలకు పోలీసులు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో పోలీసులు లాఠీ చార్జీ చేశారు. సంఘటనకు నిరసనగా చంద్రబాబు నాయుడు అక్కడే బైఠాయించారు. గత రెండు రోజులుగా కడప లోకసభ స్థానంలో చంద్రబాబు ప్రచారం సాగిస్తున్న విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+