పులివెందులలో చిరంజీవిపైకి కోడిగుడ్లు, డిఎల్‌పైకి చెప్పులు

Chiranjeevi
కడప: పులివెందుల పట్టణంలో శుక్రవారం చిరంజీవి నిర్వహించిన రోడ్‌షో గందరగోళంగా మారింది. చిరంజీవిపైకి అల్లరి మూకలు కోడిగుడ్లు విసిరాయి. వాహనంపై చిరంజీవితోపాటు కాంగ్రెస్‌ అభ్యర్థులు వివేకానందరెడ్డి, డీఎల్‌ రవీంద్రారెడ్డి, 20సూత్రాల ఆర్థిక అమలుకమిటీ ఛైర్మన్‌ తులసిరెడ్డి ఉన్నారు. చిరంజీవి పేరును డీఎల్‌ పేరును రెండుమూడుమార్లు చిరంజీవి ప్రస్తావించడంతో ఆందోళనకారులు వాహనంపై ఉన్న డీఎల్‌పై కోడిగుడ్లు విసిరారు.

20 సూత్రాల అమలుకమిటీ ఛైర్మన్‌ తులసిరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్లమెంటు అభ్యర్థి డీఎల్‌ రవీంద్రారెడ్డిని మాట్లాడాలని కోరగా ప్రజలనుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. అల్లరిమూకలు మరింత రెచ్చిపోయాయి. డీఎల్‌ ప్రసంగించకూడదని అరుపులు,కేకలు వేశాయి. పూలహారాల మాటున కోడిగుడ్లు రువ్వారు. బిగ్గరగా జగన్‌కు అనుకూల నినాదాలు చేస్తూ చెప్పులు విసిరారు. ఈ దాడిలో డీఎల్‌కు స్వల్పగాయమైనట్లు తెలిసింది. ప్రచార వాహనంపై ఉన్న వివేకాపై కూడా చెప్పులు పడ్డాయి.

చిరంజీవి మైకు తీసుకుని శాంతపరిచే ప్రయత్నం చేయగా ఉద్రిక్తత కాస్త చల్లబడింది. చీకటిగా ఉండటంతో పోలీసులు దుండగులను గుర్తించలేకపోయారు. గుమిగూడిన వారిని తరిమివేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. పలువురు కాంగ్రెస్‌ అభిమానులు ఆందోళనకారులను పట్టుకుని కొట్టి పోలీసులకు అప్పగించారు. తర్వాత ఈ కార్యక్రమం యథావిధిగా కొనసాగింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+