ఆరు నెలలకో, ఏడాదికో మళ్లీ ఎన్నికలు, ప్రభుత్వం ఉండదు: వైయస్ జగన్

YS Jagan
కడప: కడప లోకసభ స్థానంలోని గుంతపల్లి రోడ్ షోలో శనివారం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం ఉండదని, ఆరు నెలలకో, ఏడాదికో ఎన్నికలు వస్తాయని ఆయన అన్నారు. ఈ ప్రభుత్వాన్ని సాగనంపితేనే రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయని ఆయన చెప్పారు. ప్రభుత్వం వైయస్సార్ సంక్షేమ పథకాలకు తూట్లు పొడుస్తోందని ఆయన చెప్పారు. కొత్త పథకాలను ప్రవేశపెట్టకపోగా, ప్రస్తుత పథకాలను సరిగా అమలు చేయడం లేదని ఆయన అన్నారు.

సంక్షేమ పథకాలు అమలు కావాలంటే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికారంలోకి రావాలని, అందుకు తమను గెలిపించాలని ఆయన అన్నారు. కడప, పులివెందుల ఉప ఎన్నికల తర్వాత పెను మార్పులు చోటు చేసుకుంటాయని ఆయన ఉప ఎన్నికల ప్రచారంలో పదే పదే చెబుతూ వస్తున్నారు. తాజాగా, శనివారం ఆయన ప్రభుత్వం మనుగడ సాగించదని తేల్చి చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+