బిజెపిలోకి మాజీ ఎమ్మెల్యే మందాడి, ఇంటికి వెళ్లి కలిసిన రాష్ట్ర అధ్యక్షుడు?

BJP
వరంగల్: ఓరుగల్లు జిల్లాలో ఓ మాజీ శాసనసభ్యుడు త్వరలో భారతీయ జనతా పార్టీలో చేరే అవకాశమున్నట్టుగా తెలుస్తోంది. వరంగల్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే మందాడి సత్యనారాయణ త్వరలో బిజెపిలో చేరనున్నట్లుగా తెలుస్తోంది. మే 31న కరీంనగర్‌లో జరిగే భారీ బహిరంగసభలో అధికారికంగా బిజెపిలో చేరనున్నట్లుగా తెలుస్తోంది. ఆదివారం వరంగల్ జిల్లా వెళ్లిన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి వరంగల్‌లోని మందాడి ఇంటికి వెళ్లి స్వయంగా కలిశారు. తెలంగాణపై, మందాడి రాజకీయ భవిష్యత్తుపై చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది.

మందాడి సత్యనారాయణ గతంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా పుట్టుకు వచ్చిన తెలంగాణ రాష్ట్ర సమితి నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అనంతరం ఆయన పార్టీతో విభేదించి బయటకు వచ్చారు. నాటి ముఖ్యమంత్రి వైయస్ చలువతో కాంగ్రెసు పార్టీలో చేరారు. ఆయనతో పాటు మరికొంత మంది ఎమ్మెల్యేలు కూడా బయటకు వచ్చి కాంగ్రెసులో చేరారు. అయితే గత కొంతకాలంగా మందాడి రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనడం లేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+