ఎక్కడైనా సరే, అక్కడ మాత్రం నో కాంప్రమైజ్: నాగం జనార్ధన్ రెడ్డి

ప్రతి నియోజకవర్గంలో ప్రతి పార్టీకి కార్యకర్తలు ఉంటారని అయితే ఆ నియోజకవర్గంలో సాధారణ ప్రజలు కూడా ఉంటారని వారి కోరిక మేరకు కూడా నడుచుకోవాల్సి ఉంటుందని చెప్పారు. నా నియోజకవర్గంలో సభను ఏర్పాటు చేయడం కొత్త కాదన్నారు. గతంలో కూడా ప్రాజెక్టుల రూపకల్పన తదితర విషయాలపై అనేక సభలు ఏర్పాటు చేశానని అన్నారు. ఇప్పుడు కూడా స్థానికంగా ఉన్న ప్రజా సమస్యలపై చర్చిస్తానని చెప్పారు.
ప్రస్తుతం తెలంగా ఉద్యమం ప్రజల చేతుల్లో ఉందని నాయకుల చేతులో ఉందని చెప్పారు. ఇలాంటి సమయంలో సభపై వెనక్కి తగ్గేది లేదన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యమం ప్రజల చేతిలో ఉన్నప్పుడు నేతలు వారి వెంట తప్పకుండా వెళ్లాల్సిందే అన్నారు. ఇలాంటి సమయంలో కూడా మా వెంటే ప్రజలు రావాలని అనుకుంటే ఎవరైనా నేతలు కోరుకుంటే అది తప్పన్నారు. తెలంగాణ ఉద్యమం ఓ వర్గానికి చెందింది కాదన్నారు. ఉద్యమంలో బలహీనవర్గాలే ముందు ఉన్నాయన్నారు.












Click it and Unblock the Notifications