లాడెన్‌ను మేమే మట్టుబెట్టాం, మా దేశాన్ని కాపాడుకోవడానికే: ఒబామా

Barack Obama
వాషింగ్టన్: ఆల్ ఖైదా అధినేత ఒసామా బిన్ లాడన్‌ మరణించినట్లు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ధ్రువీకరించారు. పాకిస్తాన్ సహకారంతో లాడెన్‌ను తాము మట్టుబెట్టామని, తమ దేశాన్ని కాపాడుకోవడానికే ఆ పని చేశామని ఆయన చెప్పారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన చేశారు. పాకిస్తాన్ సైన్యం సహకారంతో తమ సిఐఎ లాడెన్‌ను మట్టుబెట్టినట్లు ఆయన తెలిపారు. ఉగ్రవాదంపై పోరులో సహకరించినందుకు ఆయన పాకిస్తాన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఉగ్రవాదంపై పోరులో పాకిస్తాన్ ఇలాగే సహకరిస్తుందని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు.

లాడెన్‌ కోసం తమ సైన్యం పదేళ్లుగా పోరాటం చేస్తోందని, ఏడాది క్రితం లాడెన్ కదలికలపై తమకు సహకారం అందిందని, వారం రోజులుగా లాడెన్ కోసం విస్తృతంగా గాలించామని ఆయన చెప్పారు. తనకు సమాచారం అందించి లాడెన్‌ను మట్టుబెట్టారని ఆయన చెప్పారు. తమ దేశంపై కన్నేస్తే సహించేది లేదని, తాము ఏదైనా అనుకుంటే సాధించి తీరుతామని ఆయన అన్నారు. తాము ఇస్లాంకు వ్యతిరేకం కాదని, ఉగ్రవాదానికి మాత్రమే వ్యతిరేకమని ఆయన చెప్పారు. లాడెన్‌ను మట్టుబెట్టడం ఓ చారిత్రక విజయమని ఆయన అన్నారు.

లాడెన్ మృతితో అమెరికాలో సంబరాలు జరుగుతున్నాయి. ప్రజలు పెద్ద యెత్తున శ్వేత సౌధం ముందు గుమికూడి తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. లాడెన్ మృతదేహం తమ సైన్యం వద్దనే ఉందని ఒబామా చెప్పారు. అమాయకులైన అమెరికన్లను లాడెన్ చంపాడని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+