లాడెన్ మృతితో బయటపడిన పాకిస్తాన్ దొంగ వైఖరి

ఉగ్రవాదంపై పోరులో పాకిస్తాన్ తమకు సహకరిస్తోందని ఒబామా చెప్పినప్పటికీ పాకిస్తాన్ వైఖరి మాత్రం బయటి ప్రపంచానికి తెలిసి వచ్చింది. లాడెన్ తమ దేశంలో లేడంటూ పాకిస్తాన్ బుకాయిస్తూ వచ్చింది. కానీ, తీరా అమెరికా లాడెన్‌ను తమ దేశంలోనే హతమార్చడం పాకిస్తాన్ నేతలకు మింగుడు పడి ఉండదు. లాడెన్ నివసిస్తున్న భవనం సమీపంలోని సైనిక పటాలాన్ని పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అష్ఫాక్ పర్వేజ్ కయానీ గత నెలలో సందర్శించాడు. ఇది పాకిస్తాన్‌ను మరింత ఇబ్బంది పెట్టే విషయం. తమ సైన్యం ఉగ్రవాదం వెన్ను విరిచిందని ఆ సమయంలో కయానీ ప్రకటించాడు కూడా. లాడెన్ స్థావరం గురించి పాకిస్తాన్ నేతలకు, సైనికాధికారులకు తెలుసుననే మాట వినిపిస్తోంది. ఐఎస్ఐ పాత్రపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.












Click it and Unblock the Notifications