కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నష్ట నివారణ దిశగా జగన్, రామోజీ సహా మీడియాపై నిప్పులు

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
కడప: బిజెపితో పొత్తుపై తన వ్యాఖ్యల వల్ల కలిగిన నష్టాన్ని నివారించుకునే పనిలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కడప లోకసభ అభ్యర్థి వైయస్ జగన్ పడ్డారు. తన వ్యాఖ్యలపై మీడియాలో వచ్చిన వార్తాకథనాలపై నిప్పులు చెరిగారు. నాన్న సాక్షిగా బిజెపితో పొత్తు ఉండదని ఆయన చెప్పారు. కడప జిల్లా మైదుకూరులో ఆయన మంగళవారం ఎన్నికల ప్రచారం సాగించారు. తాను మాట్లాడిన విషయాలను మొత్తాన్ని ఇవ్వకుండా, కొంత భాగాన్ని తీసుకుని మీడియా వక్రీకరించిందని ఆయన చెప్పారు. ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు కూడా ఇవ్వడానికి ఇష్టపడని బిజెపి పది శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి సిద్ధపడుతుందా అనే ఆలోచన కూడా చేయలేదని ఆయన అన్నారు. తాను పది నిమిషాలు మాట్లాడితే ఒక నిమిషం మాట్లాడిన విషయాన్ని తీసుకుని వక్రీకరించారని ఆయన అన్నారు.

ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, టీవీ9 తనకు వ్యతిరేకింగా ప్రచారం సాగిస్తున్నట్లు ఆయన ఆరోపించారు. ఒక అబద్ధాన్ని నిజం చేయడానికి అందరూ ఒక్కటయ్యారని, ఇందులో కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ పాత్ర కూడా ఉందని ఆయన అన్నారు. బిజెపి నాయకుడు గాలి జనార్దన్ రెడ్డికి తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి కడప జిల్లాలో ఉక్కు కర్మాగారానికి అనుమతి ఇచ్చారని, అప్పుడు ఏమీ మాట్లాడని కాంగ్రెసు నాయకులు ఇప్పుడు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు. కాంగ్రెసు, ఆ పార్టీ నాయకత్వం దిగజారిపోయాయని ఆయన వ్యాఖ్యానించారు. తాము గెలిస్తే ముస్లింలకు 4 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పిస్తామని ఆయన చెప్పారు.

English summary
YSR Congress party candidate YS jagan lashed out at Eenadu Ramoji Rao, Andhrajyothy, Chandrababu Naidu and TV9.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X