త్వరలో లాడెన్ చివరిగా మాట్లాడిన ఆడియో టేప్ విడుదల: ఆల్-ఖైదా

నాలుగు పేజీల నిడివి గల ఆ ప్రకటనలో ఒసామా బిన్ లాడెన్ మృతి చెందినట్లు ఆల్-ఖైదా ప్రకటించింది. అంతేకాకుండా లాడెన్‌ను చంపినందుకు ప్రతీకారంగా అమెరికా, యూరప్ దేశాలపై మరిన్ని దాడులకు పాల్పడుతామని హెచ్చరించింది. ఇంకా బిన్ లాడెన్ మరణం ఓ శాపమని, అది అమెరికన్లు మరియు వారి ఏజెంట్లను వెంటాడుతుందని, అమెరికన్ల సంతోషం త్వరలోనే విషాదంగా మారుతుంది. వారి రక్తం, కన్నీళ్లలో కలుస్తుంది" అని అల్ కాయిదా తన ప్రకటనలో పేర్కొంది.
అమెరికాపై దాడికి పాక్‌లోని ముస్లింలు సహకరించాలని, లాడెన్ అసువులుబాసిన పాక్ నేలలోని ముస్లింలు తిరగబడాలని, అమెరికన్ల వల్ల అవినీతిమయమైన పాక్‌ను పరిశుద్ధం చేసుకోవడానికి ముందుకు రావాలంటూ ఆల్-ఖైదా పేర్కొంది. ఈ వివరాలను ఇస్లామిక్ తీవ్రవాదుల వెబ్‌సైట్లపై నిఘా పెడుతున్న అమెరికా పర్యవేక్షణ సంస్థ 'సైట్" ఈ ప్రకటించింది.












Click it and Unblock the Notifications