వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లాడెన్‌ను పక్కకు తప్పించిన జవహరి, ఆరేళ్ల క్రితమే దూరం?

By Pratap
|
Google Oneindia TeluguNews

Al Zawahiri
వాషింగ్టన్: ఆల్ ఖైదాలో నెంబర్ టూగా వెలుగొందుతున్న ఆల్ జవహరి ఆరేళ్ల క్రితమే ఒసామా బిన్ లాడెన్‌ను పక్కకు తప్పించినట్లు చెబుతున్నారు. పాకిస్తానీ నిఘా అధికారులను ఉటంకిస్తూ వాల్ జర్నల్ ఈ మేరకు ఓ వార్తాకథనాన్ని ప్రచురించింది. 1988లో ఆల్ ఖైదా ఏర్పాటులో సహకరించిన జవహరి నిధులు లేకపోవడం వల్ల, వ్యవస్థలో ప్రతిష్ట దిగజారిపోతుండడం వల్ల లాడెన్‌ను పక్కకు తప్పించారని అంటున్నారు. దానివల్ల ఆరేళ్లుగా లాడెన్ తన కుటుంబ సభ్యులతో అబ్బొత్తాబాదులో నివాసం ఉంటున్నట్లు చెబుతున్నారు.

అయితే, లాడెన్‌కు జవహరి దూరమైనట్లు తమకు తెలియదని కొంత మంది అధికారులు చెప్పినట్లు కూడా జర్నల్ రాసింది. ఆల్ ఖైదాకు ప్రధానమై సూత్రధారి, స్ఫూర్తిప్రదాతగా లాడెన్ వ్యవహరిస్తుంటే ప్రధానమైన సిద్ధాంతకర్తగా, ఆపరేషనల్ కమాండర్‌గా జవహరి వ్యవహరిస్తున్నాడు. జవహరి ఆల్ ఖైదా పగ్గాలు చేపట్టే సూచనలే ఎక్కువగా ఉన్నాయి. తన వారసుడిగా జవహరిని లాడెన్ కూడా అంగీకరించినట్లు చెబుతారు.

English summary
Osama Bin Laden and his deputy Ayman al-Zawahiri "parted ways" six years ago after he "marginalized" the al Qaeda leader, the Wall Street Journal reported citing a senior Pakistani intelligence official.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X