రష్యా కోటీశ్వరుడు సులేమాన్ కెరిమోవ్‌తో హసన్ అలీ ఖాన్ లింక్స్

ఖాన్‌కు కెరిమోవ్‌ను ఎవరు పరిచయం చేశారనేది తెలియడం లేదు. వారి మధ్య 2002లో భేటీ జరిగినట్లు, కెరిమోవ్ ప్రధాన వ్యాపారం చమురు నిక్షేపాల వెలికితీత అని, మధ్య ఆసియాలో ఆయనకు కొన్ని వ్యాపారాలున్నాయని, ఖాన్ కొన్ని పారిశ్రామిక యూనిట్లను కొనుగోలు చేయాలని అనుకున్నాడని అధికారులు చెప్పినట్లు వార్తలు వచ్చాయి. భారతదేశంలో కెరిమోమ్ పరోక్ష పెట్టుబడులు పెట్టి ఉండవచ్చునని అధికారులు అనుమానిస్తున్నారు.
ఖాన్, తపూరియా 400 కోట్ల రూపాయలకు పైగా అక్రమంగా తరలించినట్లు ఇడి ఆరోపిస్తోంది. ఖాన్‌కు సింగపూర్‌లో రెండు ఖాతాలున్నాయని, మరో ఖాతా అతని భార్య రీమా పేరు మీద ఉందని చెప్పారు. యుబిఎస్ జూరిచ్ ఖాతా నుంచి హసన్ అలీ ఖాన్ సింగపూర్ ఎస్‌బిసి ఖాతాకు 300 కోట్ల రూపాయలు బదిలీ అయ్యాయి.












Click it and Unblock the Notifications